Atlassian CEO Scott Farquhar కోవిడ్ మహమ్మారి, లాక్‌డౌన్ సమయంలో కంపెనీలకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' బాగా ఉపయోగపడింది. కరోనా తగ్గిపోవడంతో దాదాపు అన్ని కంపెనీలు 'హైబ్రిడ్' విధానానికి స్వస్తి పలికి, ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి రావాలని ఆదేశిస్తున్నాయి. ముఖ్యంగా 'వర్క్ ఫ్రమ్ ఆఫీస్' విధానాన్ని సమర్ధిస్తున్న వారిలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ప్రముఖంగా నిలుస్తారు. ఇంటి నుండి పనిచేసే వ్యక్తులనుంచి తక్కువ ఫలితం ఉంటుందనేది ఆయన వాదన.
అయితే అట్లాసియన్ సహ-వ్యవస్థాపకుడు, సీఈవో బిలియనీర్ స్కాట్ ఫర్క్హార్ మాత్రం ఇందుకు బిన్నంగా ఉన్నాడు 2023లో 8.2 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో ఆస్ట్రేలియాలో 7వ అత్యంత సంపన్నుడైన స్కాట్ ఇంటి నుండి పని చేయడమే మేలు అంటాడు. తన ఉద్యోగులను కూడా ఇంటినుంచి పనికే ప్రోత్సహిస్తున్నాడు.
Hello from @Atlassian India! This a key R&D hub for us and our fastest growing region. From hiring our first employee here five years ago to 1,700 people today and growing with 50% working remote. And already kicking goals as 8th Best Place to Work. I am so proud of this team. pic.twitter.com/spnEFigqOS
— Scott Farquhar (@scottfarkas) August 11, 2023
డైలీ మెయిల్ ప్రకారం స్కాట్ తన కంపెనీలు చాలామంది ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతినిచ్చాడు. తద్వారా వారు పనిలో మరింత ఉత్పాదకతను కలిగి ఉంటారనీ, ఏకకాలంలో అటు ఉద్యోగం, ఇటు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు అనేది స్కాట్ విశ్వాసం. ఇళ్ల రేట్లు బాగా ఉండే ఖరీదైన నగరం సిడ్నీలో అట్లాసియన్ ప్రధాన కార్యాలయం ఉంది.ఇక్కడ అద్దెలు ఎక్కువే. దీనికి తోడు భయంకరమైన ట్రాఫిక్ కారణంగా ఆఫీసుకు రావాలంటే గంటల సమయం పడుతోంది. ఇదే తనను రిమోట్ వర్కింగ్‌పై మళ్లించిందని చెప్తాడు. అంతేకాదు స్వయంగా స్కాట్ ఫర్క్హర్ 3 నెలలకు ఒకసారి కార్యాలయానికి వెళ్తాడు.
సిడ్నీలో హౌసింగ్ వెనుక భారీ మొత్తం చెల్లించే బదులు, ఉద్యోగులు మంచి జీవితాన్నిగడిపేలా నగరానికి కొంచెం దూరంగా బీచ్ సైడ్ అపార్ట్‌మెంట్లలో ఉండవచ్చని, అలాగే ఇంటినుంచి పనిచేస్తే ఆఫీస్‌కు వచ్చి పోయే సమయం కూడా ఆదా అవుతుంది అంటాడు. తన ఉద్యోగులు ఎక్కడ నుంచి పనిచేశారనేది కాకుండా వారిచ్చే ఔట్‌పుట్ ఏంటి అనేదే తనకు ముఖ్యమని ఫర్‌క్హార్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment