దూరదర్శన్‌లో 1983లో ప్రసారమైన రామాయణం సీరియల్ గుర్తుందా? రామాయణం, రాముడి కథను అద్భుత దృశ్యకావ్యంగా బుల్లి తెరకు పరిచయం చేసిన ఘనత రామానంద్ సాగర్‌కు చెందుతుంది. ఇప్పటికీ కోట్లాది మంది భారతీయుల్లో గుండెల్లో నిలిచిపోయిన ఆధ్యాత్మిక అద్భుతమంది. రామాయణం తరువాత ఉత్తర రామాయణ్ కూడా తీసుకొచ్చారు రామానంద్. ఈ రెండూ అత్యధికంగా వీక్షించిన సీరియల్స్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాయి.
అంతేకాదు ఈ పాపులర్ సీరియల్‌లోని ప్రతి పాత్రధారుడు అద్భుతంగా నటించారు. సీత రాముడు అంటే ఇలానే ఉంటారా అన్న రీతిలో వారిని గుర్తుంచుకున్నారు జనం. ఈ సీరియల్‌లోని చాలా మంది నటులు ఇప్పటికీ నటనా రంగంలో కొనసాగుతున్నారు. శ్రీరాముడు తనయులు లవకుశుల్లో ఒకరిగా నటించిన వ్యక్తి ఇపుడు ఎక్కుడున్నాడో తెలుసా? నటనా ప్రపంచానికి పూర్తిగా దూరంగా వ్యాపారంలో అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు. ఒక కంపెనీకి సీఈవోగా కోట్లకు అధిపతిగా ఉన్నారు. ఆయన పేరే మయూరేష్ క్షేత్రమదే.
బాల నటుడిగా మయూరేష్ లవుడి పాత్రలో కనిపించారు. అయితే 13 ఏళ్ల వయసులో నటనకు స్వస్తి చెప్పిన మయూరేష్ నటనకు స్వస్తి చెప్పిన మయూరేష్ చదువుల వైపు దృష్టి సారించాడు. ఫైనాన్స్ ప్రపంచంలో తన వృత్తిని కొనసాగించడానికి అమెరికా వెళ్లాడు. మయూర్ష్ 2003లో ప్రపంచ బ్యాంక్‌లో పరిశోధకుడిగా తన వృత్తిని ప్రారంభించి, ఆ తరువాత అనేక ఇతర సంస్థలలో పనిచేస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు.
2016లో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెటింగ్ ప్లాట్‌ఫారమ్ కమిషన్ జంక్షన్‌లో చేరాడు. 2019 నాటికి మయూరేష్ కంపెనీ సీఈవో స్థాయికి ఎదిగారు. 2022 నాటికి, దీని ఈ కంపెనీ ఆదాయం 170 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 1400 కోట్లు) పైమాటే. కుటుంబంతో సహా అమెరికాలో నివసిస్తున్నారు. మయూరేష్ స్పైట్ అండ్ డెవలప్‌మెంట్ అనే పుస్తకాన్ని కూడా రాశాడు.
ఈ సీరియల్‌లో కుష్ పాత్రను స్వప్నిల్ జోషి మరాఠీ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇతనికి పిల్లు టీవీ అనే యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. రామాయణ సీరియల్‌లో శ్రీరాముడిగా నటించిన అరుణ్ గోవిల్, సీత పాత్రలో దీపికా చికిలియా, లక్ష్మణుడి పాత్రలో సునీల్ మెప్పించారు. జనవరి 22న అయోధ్యలో జరిగిన శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఈ ముగ్గురు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మా రాముడొచ్చాడు అంటూ వీరికి భక్తులు నీరాజనాలు పట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment