సాక్షి, బెంగళూరు: భార్యను హత్య చేసి ఢిల్లీకి పరారైన భర్తను బెంగుళూరు పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. వివరాలు.. బెంగళూరుకు చెందిన నాజ్(22) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తుంది. పశ్చిమబెంగాల్‌కు చెందిన నాసిర్ హుసేన్ కూడా టెక్కీ అని ఆమెను నమ్మించి ఆరు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొని తావరెకెరె సభాష్‌నగరలో బాడుగ ఇంటిలో కాపురం పెట్టారు. నాజ్ ఐదు నెలల గర్భవతి.
గర్భం ధరించిన్నప్పుటీ నుంచి ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. దీంతో కడుపులో ఉన్న శిశువుకు తనకు ఏ సంబంధం లేదంటూ నాజ్‌ను వేధించేవాడు. అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు. దీనికి నాజ్ ఒప్పకోలేదు. ఈ గొడవలతో ఇటీవల ఆమెను గొంతు పిసికి హత్య చేశాడు. ముందుగానే ప్లాన్ వేసుకున్న నాసీర్‌హుసేన్ నాజ్‌ను హత్య చేసి రాత్రికి రాత్రే బెంగళూరు విమానాశ్రయం నుంచి విమానంలో డిల్లీ బయలుదేరి వెళ్లిపోయాడు.
విమానం దిగుతున్న సమయంలో నాజ్ సోదరుడికీ ఫోన్ సందేశం పెట్టాడు. నీ చెల్లెలు వివాహేతర సంబంధం కారణంగా హత్య చేశానని.. మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించాడు. అనంతరం ఫోన్ అఫ్ చేశాడు. మృతురాలి బంధువుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు గాలించి అతన్ని ఢిల్లీలో పట్టుకుని బెంగళూరుకు తరలించారు. ముక్కూ మొహం తెలియని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నందుకు ప్రాణాలే పోయాయని ఆమె బంధువులు ఆవేదన చెందారు.
చదవండి: చిరుత దాడి.. ఇంటికి వస్తున్న చిన్నారిని ఎత్తుకుని పోయి చంపేసిన వైనం
Comments
Please login to add a commentAdd a comment