Man Kills Wife And Commits Sucide In Karnataka - Sakshi
Sakshi News home page

భార్యపై అనుమానం.. నిద్రలో ఉండగా సిలిండర్‌ ఆన్‌ చేసి..

Published Mon, Nov 29 2021 7:48 AM | Last Updated on Mon, Nov 29 2021 9:40 AM

Man Assassination Wife And Commits Suicide In Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

భార్యపై అక్రమ సంబంధం అనుమానంతో ఓ శాడిస్టు భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ దుర్ఘటన ఇక్కడి  ఆడుగోడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది.

బనశంకరి(కర్ణాటక): భార్యపై అక్రమ సంబంధం అనుమానంతో ఓ శాడిస్టు భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ దుర్ఘటన ఇక్కడి  ఆడుగోడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. భర్త కోసం గాలిస్తున్న పోలీసులకు ఆంధ్ర సరిహద్దుల్లో అతని మృతదేహం లభ్యమైంది. వివరాలు...ఆడుగోడి రాజేంద్రనగరలో నిసార్, అయేషా దంపతులు నివాసం ఉంటున్నారు. 20 ఏళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న నిసార్‌ తరుచూ ఆమెతో గొడవపడేవాడు. అనుమానం పెరిగిపోవడంతో భార్యను హత్య చేయడానికి పథకం వేశాడు.

ఈనెల 19న ఆమె నిద్రలో ఉండగా సిలిండర్‌ ఆన్‌ చేసి పెట్రోల్‌ చల్లి పేలిపోయేలా చేశాడు. దీంతో ఆమె ప్రమాదంలో చనిపోయిందని నమ్మించాడు. అప్పటి నుంచి నిసార్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో అతని సెల్‌ఫోన్‌ ట్రేస్‌ చేయడంతో సరిహద్దు అటవీ ప్రాంతంలో అతని మృతదేహం కనిపించింది. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement