వీడిన మిస్టరీ: భార్యను ముక్కలుగా నరికి.. | Man Assassination Wife In Karnataka | Sakshi
Sakshi News home page

అనుమానం పెనుభూతమై.. 

Published Tue, Mar 9 2021 6:29 AM | Last Updated on Tue, Mar 9 2021 11:12 AM

Man Assassination Wife In Karnataka - Sakshi

మండ్య జిల్లా పాండవపుర తాలూకా దేశవళ్లికి చెందిన ఆశా (28), రంగప్ప భార్యభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు, భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో నాలుగు నెలల క్రితం రంగప్ప,  బావ చంద్రతో కలిసి ఆశాను నరికి చంపాడు. కొడవలితో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి హేమావతి నదిలో పడేశారు

మండ్య(కర్ణాటక): భార్యపై ఉన్న అనుమానంతో ఓ భర్త అతికిరాతకంగా ఆమె తల, కాళ్లు, చేతులు నరికి మృతదేహాన్ని పీసులుగా చేసి హేమావతి నదిలో పడేసిన ఘటనపై పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనలో మృతురాలి భర్తతో పాటు అతని బావను అరెస్ట్‌ చేశారు. ఈమేరకు ఎస్‌పీ అశ్విని సోమవారం వివరాలు వెల్లడించారు.

మండ్య జిల్లా పాండవపుర తాలూకా దేశవళ్లికి చెందిన ఆశా (28), రంగప్ప భార్యభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు, భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో నాలుగు నెలల క్రితం రంగప్ప,  బావ చంద్రతో కలిసి ఆశాను నరికి చంపాడు. కొడవలితో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి హేమావతి నదిలో పడేశారు. అయితే వీరిపై అనుమానించిన ఆశా తండ్రి గౌరి శంకర్‌ పాండవపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో కృష్ణరాజపేట పోలీసులు గుర్తు తెలియని మృతదేహంపై సమాచారం ఇచ్చారు. గౌరి శంకర్‌ మృతదేహాన్ని చూసి తన కుమార్తెగా గుర్తించాడు. దీంతో పోలీసులు మృతురాలి భర్త రంగప్పను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో నిజం ఒప్పుకున్నాడు.
చదవండి:
కుప్ప‘కూలి’న గోడ.. తెల్లారిన ఆరుగురి బతుకులు 
నా భర్తకు మరో పెళ్లట... నాకు న్యాయం చేయండి!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement