పట్టపగలు.. జనంతో కిక్కిరిసిన రోడ్డు మీద రెండు గ్యాంగ్‌లు పరస్పరం కాల్పులతో బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో ఇద్దరు పాత నేరస్తులు మృతి చేందారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ ద్వారకా మోర్ మెట్రో స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నవడా ప్రాంతానికి చెందిన ప్రవీణ్ గెహ్లోత్, వికాస్ దళాల్ రెండు వేర్వేరు గ్యాంగ్‌లు నడుపుతూ నేరాలకు పాల్పడుతుంటారు. వీరి మీద ఢిల్లీ, హరియాణాలో గతంలోనే హత్యా, కిడ్నాప్, దొంగతనం వంటి పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ రెండు గ్యాంగ్‌ల మధ్య ఘర్షణ జరిగింది.