ఆ వీధి నిర్మానుష్యంగా ఉంది. ఓ మహిళ తన చిన్నారి కొడుకుతో కలిసి నడుస్తూ వస్తోంది. ఓ చేతిలో కొడుకు స్కూల్ బ్యాగు. మరో చేతిలో బాబును పట్టుకొని ఉంది. వారిని వెంబడిస్తూ ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చారు. వీధి నిర్మానుష్యంగా ఉండటం.. ఆ ఇద్దరు మాత్రమే నడుచుకుంటూ వెళ్లడం గమనించారు. ఇంతలోనే ఆమెను దాటి వెళ్లి కాస్త ముందు బైక్‌ను ఆపారు. ఒకడు బైక్ దిగి ఆమె నడుచుకుంటూ వెళ్లడాన్ని గమనించాడు. ఆమె కాస్త ముందుకు వెళ్లగానే.. అమాంతం వెనుక నుంచి వచ్చి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని బలంగా లాగేసుకొని పారిపోయాడు.
హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో షాక్ తిన్న ఆ మహిళ అతన్ని వెంబడించేందుకు ప్రయత్నించింది. కానీ, గొలుసు లాక్కొని వెళ్లినవాడు.. తన కోసం ఆగిన బైక్ ఎక్కి చక్కా పారిపోయాడు. ఢిల్లీలోని ఛావ్లా ప్రాంతంలో శుక్రవారం పట్టపగలు జరిగిన ఈ చెయిన్ స్నాచింగ్ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
పట్టపగలే షాకింగ్ ఘటన..
Sep 7 2019 3:32 PM | Updated on Mar 22 2024 11:30 AM
Advertisement