సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ వద్ద చేస్తున్న గ్రూప్-2 పరీక్ష అభ్యర్థుల ధర్నాలో కొత్త ట్విస్ట్ నెలకొంది. పరీక్షను వాయిదా వేయాలని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు విద్యార్థులను రెచ్చగొట్టారని ఇంటెలిజెన్స్ పోలీసులకు సమాచారం అందింది. పరీక్షకు సమయం లేకపోవడంతో కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆందోళనలో ఉన్నట్లు గుర్తించారు.
ఈ క్రమంలో పలువురు కోచింగ్ సెంటర్‌ల నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విద్యార్థులను రెచ్చగొడుతున్న ఇద్దరూ కోచింగ్ సెంటర్ యజమానులను అదుపులోకి తీసుకున్నారు. రియాజ్, అశోక్ అనే ఇద్దరు కోచింగ్ నిర్వాహకులు తమ దగ్గర కోచింగ్ తీసుకునే విద్యార్థులను రోడ్డుమీదికి తీసుకొచ్చి ధర్నా చేయించినట్లు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment