ముంబై: కొత్తగా ఎంపికైన భారత క్రికెట్ జట్టు సహాయక సిబ్బంది కాంట్రాక్ట్‌లు సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి వస్తాయని బీసీసీఐ వెల్లడించింది. దీనికి సంబంధించిన అన్ని పత్రాలు, ఒప్పందాలు సిద్ధమయ్యాయని, గురువారంలోగా లాంఛనం పూర్తవుతుందని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ ద్వారా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి ఎంపిక కాగా... బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ల ఎంపిక జాబితాను సెలక్షన్ కమిటీ బోర్డు ముందుంచింది. బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్.శ్రీధర్ కొనసాగనుండగా... విక్రమ్ రాథోడ్ కొత్త బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఫిట్‌నెస్ అండ్ కండిషనింగ్ ట్రైనర్ కోసం మాత్రం ప్రస్తుతం ఎన్‌సీఏలో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment