ప్రాథమిక అంచనాకు వచ్చిన సబ్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగులకు గరిష్ట వయో పరిమితిని ఐదేళ్లకు పెంచితేనే మంచిదని సబ్ కమిటీ ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో అనుసరించాల్సిన పరీక్షల విధానంపై (స్కీం) ఓ నిర్ణయానికి వచ్చేందుకు ప్రభుత్వం ఇటీవల ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో సబ్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కమిటీ సోమవారం సచివాలయంలో కడియం శ్రీహరి అధ్యక్షతన సమావేశమై పోటీ పరీక్షల విధానం, వయో పరిమితి పెంపు వంటి అంశాలపై చర్చించింది. గరిష్ట వయోపరిమితిని పదేళ్లు పెంచాలన్న డిమాండ్‌ను పరిశీలించింది. అయితే గరిష్ట వయోపరిమితిని పదేళ్లకు పెంచితే కొన్ని కేటగిరీల వారు ఉద్యోగం చేసే కాలం చాలా తక్కువ ఉండే అవకాశం ఉండడంతో 5 ఏళ్ల పెంపే సబబు అని అంచనాకు వచ్చినట్లు సమాచారం.
కాగా, పరీక్షల విధానంపై టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతీసుబ్రహ్మణ్యం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించినట్లు తెలిసింది. ఈ అంశాలన్నింటిపై ఈనెల 4న మరోసారి సమావేశం కావాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
గరిష్ట వయోపరిమితి పెంపు ఐదేళ్లే!
Published Tue, Jun 30 2015 3:35 AM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM
Advertisement