భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వేలా ది పోస్టులను భర్తీ చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పదేపదే చేసిన ప్రకటనలు నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించారుు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 36 ఏళ్లకు పెంచడంతో ఈసారైన తమకు ఉద్యోగాలు వస్తాయని పలువురు ఆశించారు. ఏపీపీఎస్‌సీ ద్వారా జిల్లాస్థాయి పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ ఆమోదం తెలపడంతో నిరుద్యోగులు సంబరపడ్డారు. అరుుతే, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇప్పటివరకూ విడుదల కాలేదు. మరోవైపు వయో పరిమితిని పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోకు మంగళవారం (డిసెంబర్ 31వ తేదీ)తో గడువు ముగిసిపోతోంది.
950 పోస్టులు.. లక్షమంది అభ్యర్థులు
జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు 950 పోస్టులు ఖాళీగా ఉన్నారుు. వాటి భర్తీ కోసం సుమా రు లక్ష మంది అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గరిష్ట వయో పరిమితి గడువు ముగిసిపోతుండటం, పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడకపోవడం నిరుద్యోగులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఊగిసలాటలో ఏపీపీఎస్‌సీ
రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ఉద్యోగుల భర్తీ ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికార యంత్రాంగం చెబుతోంది. ఈ పరిస్థితుల్లో ఏపీపీఎస్‌సీ తనకు తానుగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉందంటున్నా రు. స్వతంత్ర ప్రతిపత్తి గల ఇలాంటి సంస్థలకు ప్రభుత్వం, ఆర్ధిక శాఖ ఆమోదం తెలిపిన తరువాత ప్రకటనల జారీకి ఆలస్యం చేయాల్సిన అవసరం లేదని అభ్యర్థులు పేర్కొంటున్నారు. అరుునా, ఏపీపీఎస్‌సీ అలసత్వం వహించడం తమ పాలిట శాపంగా మారిందని నిరుద్యోగులు వాపోతున్నారు.
మిగిలింది మూడు నెలలే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో మూడు నెలలు మాత్రమే ఉంది. ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు వెలువడుతున్నారుు. సాధారణంగా ఎన్నికల ముందు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే రాష్ట్ర విభజన పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర స్థాయి, జోనల్ స్థాయి ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికలకు 40 రోజులు ముందుగానే ఎన్నికల సంఘం నియమావళి అమలులోకి వస్తుంది. ఆ సమయంలో కొత్త ఉద్యోగాల ప్రకటనల నోటిఫికేషన్లు జారీ చేయడం వీలుకాదు.
ఆశలు ఆవిరి
Published Tue, Dec 31 2013 4:27 AM | Last Updated on Tue, Jun 4 2019 6:36 PM
Advertisement