N.Kirankumar reddy
-
కనికరించలేదు
సాక్షి, ఏలూరు : అన్నదాతల ఆశలపై ప్రభుత్వం మరోసారి నీళ్లు చల్లింది. పంట రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకు ముందుకొచ్చిన సర్కారు.. గత రుణ మొత్తాలపై వడ్డీ రారుుతీకి మంగళం పాడింది. రుణాలను రీ షెడ్యూల్ చేసుకునే రైతులు భారీ వడ్డీ చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో పంట రుణాల రీషెడ్యూల్ అంశంపైచర్చించినప్పటికీ, వడ్డీ రాయితీ అంశాన్ని పట్టించుకోలేదని సమాచారం అందింది. వరుస తుపానులకు పంటలు నష్టపోయిన రైతులు ఖరీఫ్‌లో బ్యాం కుల నుంచి తీసుకున్న పంట రుణాలను ఇప్పట్లో చెల్లించనవసం లేకుండా రీషెడ్యూల్ చేస్తామని బ్యాంకులు చెబుతున్నారుు. దీనివల్ల జిల్లాలోని దాదాపు 1.82 లక్షల మంది రైతులకు చెందిన దాదాపు రూ.443.25 కోట్ల రుణాల చెల్లింపునకు మూడేళ్ల గడువు లభిస్తుంది. అరుుతే, స్వల్పకాలిక రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా మార్పు చేయడం వల్ల రైతులు వడ్డీ రాయితీ పొందే అవకాశాన్ని కోల్పోతారు. సాధారణంగా రూ.లక్షలోపు పంట రుణంపై వడ్డీ ఉండదు. ఆపై నూటికి పావలా వడ్డీ వసూలు చేస్తారు. రీ షెడ్యూల్ చేయటం వల్ల రుణం ఎంత తీసుకున్నా 10 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది నీలం తుపాను ఖరీఫ్‌ను తుడిచి పెట్టేసినప్పుడు ఎస్ఎల్బీసీ సమావేశమై పంట రుణాలు రీషెడ్యూల్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. వడ్డీ రాయితీని మాత్రం కల్పించలేదు. ఈసారి కూడా గతేడాది నిర్ణయాన్నే కొనసాగించాలని ఎస్ఎల్బీసీ నిర్ణయించింది. వడ్డీలు చెల్లించలేమని, రీషెడ్యూల్ చేసుకున్న తర్వాత కూడా వడ్డీ రాయితీ వర్తింపజేయాలని రైతులు ఎంతగా వేడుకున్నప్పటికీ ప్రభుత్వం గాని, బ్యాంకర్లు గాని కనికరించలేదు. బడుగు, బలహీన వర్గాలకు రాయితీలు పెంపు బడుగు, బలహీన వర్గాలకు రుణ రాయితీలను ప్రభుత్వం పెంచింది. ఎస్సీ,ఎస్టీలకు ఇప్పటివరకూ బ్యాంకు రుణంలో 50 శాతం లేదా గరిష్టంగా 30 వేలు సబ్సిడీ ఇస్తున్నారు. ఇకపై దీనిని 60 శాతం లేదా గరిష్టంగా రూ.లక్ష వరకూ రాయితీ ఇవ్వనున్నారు. బీసీలకు రుణంలో 50 శాతం లేదా గరిష్టంగా రూ.లక్ష సబ్సిడీ ఇస్తారు. జిల్లాలో 3,600 ఎస్సీ యూనిట్లకు, 4,900 బీసీ యూనిట్లకు రుణాలివ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఆయూ పథకాలకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 21 వరకూ మాత్రమే ఇచ్చారు. -
ఆశలు ఆవిరి
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వేలా ది పోస్టులను భర్తీ చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పదేపదే చేసిన ప్రకటనలు నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించారుు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 36 ఏళ్లకు పెంచడంతో ఈసారైన తమకు ఉద్యోగాలు వస్తాయని పలువురు ఆశించారు. ఏపీపీఎస్సీ ద్వారా జిల్లాస్థాయి పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ ఆమోదం తెలపడంతో నిరుద్యోగులు సంబరపడ్డారు. అరుుతే, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇప్పటివరకూ విడుదల కాలేదు. మరోవైపు వయో పరిమితిని పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోకు మంగళవారం (డిసెంబర్ 31వ తేదీ)తో గడువు ముగిసిపోతోంది. 950 పోస్టులు.. లక్షమంది అభ్యర్థులు జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు 950 పోస్టులు ఖాళీగా ఉన్నారుు. వాటి భర్తీ కోసం సుమా రు లక్ష మంది అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గరిష్ట వయో పరిమితి గడువు ముగిసిపోతుండటం, పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడకపోవడం నిరుద్యోగులను ఆందోళనకు గురి చేస్తోంది. ఊగిసలాటలో ఏపీపీఎస్సీ రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ఉద్యోగుల భర్తీ ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికార యంత్రాంగం చెబుతోంది. ఈ పరిస్థితుల్లో ఏపీపీఎస్సీ తనకు తానుగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉందంటున్నా రు. స్వతంత్ర ప్రతిపత్తి గల ఇలాంటి సంస్థలకు ప్రభుత్వం, ఆర్ధిక శాఖ ఆమోదం తెలిపిన తరువాత ప్రకటనల జారీకి ఆలస్యం చేయాల్సిన అవసరం లేదని అభ్యర్థులు పేర్కొంటున్నారు. అరుునా, ఏపీపీఎస్సీ అలసత్వం వహించడం తమ పాలిట శాపంగా మారిందని నిరుద్యోగులు వాపోతున్నారు. మిగిలింది మూడు నెలలే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో మూడు నెలలు మాత్రమే ఉంది. ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు వెలువడుతున్నారుు. సాధారణంగా ఎన్నికల ముందు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే రాష్ట్ర విభజన పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర స్థాయి, జోనల్ స్థాయి ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికలకు 40 రోజులు ముందుగానే ఎన్నికల సంఘం నియమావళి అమలులోకి వస్తుంది. ఆ సమయంలో కొత్త ఉద్యోగాల ప్రకటనల నోటిఫికేషన్లు జారీ చేయడం వీలుకాదు. -
తుపాను ప్రభావంపై సీఎం ఆరా
నరసాపురం (రాయపేట), న్యూస్‌లైన్ : జిల్లాలో హెలెన్ తుపాను ప్రభావంపై ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్‌కు ఫోన్ చేసిన ఆయన ఇక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తీరప్రాంత గ్రామాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయూలని, తుపాను బాధితులను అన్నివిధాలా ఆదుకోవాలని ఆదేశిం చారు. మత్స్యకా రులను బలవంతంగానైనా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అనంతరం విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ తుపాను ప్రభావంతో జిల్లాలో నెలకొన్న పరిస్థితులతోపాటు పునరావాస కేంద్రాల ఏర్పాటు, సహాయక చర్యలపై సీఎంకు వివరించామన్నారు. పునరావాస కేంద్రాల వద్ద జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పామని తెలిపారు. అధికారులతో సమీక్ష సహాయక చర్యల విషయమై కలెక్టర్ సిద్ధార్థజైన్ మునిసిపల్ కార్యాలయంలో జిల్లా అధికారులతో శుక్రవారం సమీక్షించారు. బియ్యపుతిప్ప ఏటిగట్టు పటిష్టతకు 500 ఇసుక బస్తాలను తక్షణం ఏర్పాటు చేయాలని కన్జర్వెన్సీ అధికారులను ఆదేశించారు. తీరప్రాంత గ్రామాల్లో వైద్య బృందాలు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. రోడ్లపై కూలిన చెట్లను తక్షణమే తొలగించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆర్అండ్బీ ఇంజినీర్లకు సూచించారు. ఉదయం నుంచి పొక్లెరుున్లతో కూలిన చెట్లను తొలగించే పనిని అధికారులు చేపట్టారు. సాయంత్రానికల్లా నేలకూలిన విద్యుత్ స్తంభాలను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్న బాధితులకు ఎటువంటి అసౌకర్యం కలుగుకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. -
పాతికేళ్ల కలకు గ్రహణం
సాక్షి, హన్మకొండ: 2014 బాలల దినోత్సవం నాటికి సైన్స్ సెంటర్‌ని ప్రారంభిస్తామని అధికారుల చెప్పిన మాటలు మరోసారి నీటి మూటలుగానే మిగిలిపోయాయి. విద్యార్థులకు సైన్స్ సందేహాలు తీర్చి వారిని భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడే సైన్స్‌సెంటర్ ప్రారంభానికి నోచుకోవడం లేదు. చిన్న అభివృద్ధి కార్యక్రమాలకు హడావుడి చేసే మంత్రులు.. ప్రతిష్టాత్మకమైన సైన్స్‌సెంటర్ వైపు మాత్రం కన్నెత్తి కూడా చూడడం లేదు. వరంగల్ నగరంలోని హంటర్‌రోడ్డులో రీజనల్ సైన్స్ సెంటర్ భవన నిర్మాణం పూర్తయి మూడేళ్లు అవుతోంది. కాకతీయ ఉత్సవాల సందర్భంగా గతేడాది డిసెంబర్లో నగరానికి వస్తున్న ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా సైన్స్‌సెంటర్‌ను ప్రారంభించాలని అధికారులు సంకల్పించారు. అందుకుతగ్గట్టుగా పనుల్లో వేగం పెంచారు. అంతే వేగంగా అరవై లక్షల రూపాయలతో సైన్స్ ఎగ్జిబిట్లు తెప్పించారు. అయితే చివరి నిమిషంలో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ ఏడాది మార్చి నాటికి భవన నిర్మాణంతోపాటు ఎగ్జిబిట్లు ఏర్పాటు చేయడం కూడా పూర్తయింది. అయినా జిల్లాకు చెందిన మంత్రులు కానీ, అధికారులుగానీ పట్టించుకోవడం లేదు. చివరికి సెప్టెంబర్ జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ జి.కిషన్ స్పందించారు. నవంబర్ 14నాటికి మిగిలిన పనులు పూర్తిచేసి సైన్స్‌సెంటర్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. మిగిలిన పనులు సాగుతూనే.. నవంబర్ 14 రానే వచ్చింది. అయినా మిగిలిన పనులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ప్రధాన పనులు పూర్తయినా లిఫ్ట్‌ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్, లాన్, ల్యాండ్‌స్కేప్, టాయిలెట్లు, ఆర్చ్,సెక్యూరిటీ సెల్ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఏళ్లతరబడి నిర్మాణ పనులు జరుగుతుండడం వల్ల భవనానికి వేసిన రంగులు వెలిసిపోతున్నాయి. ఎలక్ట్రికల్ వైరింగ్, ఏసీ తదితరాలు పాడవుతున్నాయి. పాతికేళ్ల కల ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1986లో ఏకకాలంలో ప్రాంతాల వారీగా తిరుపతి, విజయవాడ, వరంగల్‌లో మూడు రీజనల్ సైన్స్‌సెంటర్లను మంజూరు చేశారు. అయితే 1999 వరకు ఎవరూ ఈ సెంటర్ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎట్టకేలకు 1999లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు నిర్మాణం కోసం శిలాఫలకం వేశారు తప్పితే నిధులు కేటాయించలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2008లో ఈ సెంటర్ నిర్మాణం కోసం రూ. 5.87 కోట్లు కేటాయించారు. ఆయన అకాల మరణం తర్వాత పనుల్లో వేగం మందగించింది. మొత్తానికి పాతికేళ్ల నుంచి పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది. ఇంకోవైపు తిరుపతి, విజయవాడ రీజనల్ సైన్స్ సెంటర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బాలలకు అందుబాటులో విజ్ఞానం మూడు అంతస్తుల సైన్స్ సెంటర్ ప్రాంగణంలో ప్రతీ అంతస్తులో శాస్త్రసాంకేతిక రంగాలకు సంబంధించిన ఎగ్జిబిట్లు ఏర్పాటు చేశారు. ఏడు విశాలమైన హాళ్లతో కూడిన ప్రధాన భవనంలో.. మొదటి రెండు హాళ్లలో ఫిజికల్ సైన్స్ ఎగ్జిబిట్లు ఏర్పాటు చేశారు. మిగితా వాటిలో వరుసగా స్పేస్‌సైన్స్, సోలార్ పవర్, 5డి థియేటర్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్‌లతో పాటు మానవ శరీర నిర్మాణ శాస్త్రానికి సంబంధించిన నమూనాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ త్రూ శాటిలైట్ హాల్ కూడా ఉంది. -
'సోనియా విశ్వాసాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి కిరణ్'
ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల సంఖ్య పెరుగుతోంది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నమ్మకంతో ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి కట్టబెడితే ఆయన విశ్వాసాన్ని కోల్పోయారని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. అధిష్టానాన్ని ధిక్కరించేలా కిరణ్ మాట్లాడటాన్ని తప్పుపట్టారు. ఉద్యమం పేరుతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆస్తులపై దాడి చేయడం అమానుషమని సుఖేందర్‌రెడ్డి ఖండించారు.