సాక్షి, ఏలూరు : అన్నదాతల ఆశలపై ప్రభుత్వం మరోసారి నీళ్లు చల్లింది. పంట రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకు ముందుకొచ్చిన సర్కారు.. గత రుణ మొత్తాలపై వడ్డీ రారుుతీకి మంగళం పాడింది. రుణాలను రీ షెడ్యూల్ చేసుకునే రైతులు భారీ వడ్డీ చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో పంట రుణాల రీషెడ్యూల్ అంశంపైచర్చించినప్పటికీ, వడ్డీ రాయితీ అంశాన్ని పట్టించుకోలేదని సమాచారం అందింది.
వరుస తుపానులకు పంటలు నష్టపోయిన రైతులు ఖరీఫ్‌లో బ్యాం కుల నుంచి తీసుకున్న పంట రుణాలను ఇప్పట్లో చెల్లించనవసం లేకుండా రీషెడ్యూల్ చేస్తామని బ్యాంకులు చెబుతున్నారుు. దీనివల్ల జిల్లాలోని దాదాపు 1.82 లక్షల మంది రైతులకు చెందిన దాదాపు రూ.443.25 కోట్ల రుణాల చెల్లింపునకు మూడేళ్ల గడువు లభిస్తుంది. అరుుతే, స్వల్పకాలిక రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా మార్పు చేయడం వల్ల రైతులు వడ్డీ రాయితీ పొందే అవకాశాన్ని కోల్పోతారు. సాధారణంగా రూ.లక్షలోపు పంట రుణంపై వడ్డీ ఉండదు. ఆపై నూటికి పావలా వడ్డీ వసూలు చేస్తారు.
రీ షెడ్యూల్ చేయటం వల్ల రుణం ఎంత తీసుకున్నా 10 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది నీలం తుపాను ఖరీఫ్‌ను తుడిచి పెట్టేసినప్పుడు ఎస్‌ఎల్‌బీసీ సమావేశమై పంట రుణాలు రీషెడ్యూల్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. వడ్డీ రాయితీని మాత్రం కల్పించలేదు. ఈసారి కూడా గతేడాది నిర్ణయాన్నే కొనసాగించాలని ఎస్‌ఎల్‌బీసీ నిర్ణయించింది. వడ్డీలు చెల్లించలేమని, రీషెడ్యూల్ చేసుకున్న తర్వాత కూడా వడ్డీ రాయితీ వర్తింపజేయాలని రైతులు ఎంతగా వేడుకున్నప్పటికీ ప్రభుత్వం గాని, బ్యాంకర్లు గాని కనికరించలేదు.
బడుగు, బలహీన వర్గాలకు రాయితీలు పెంపు
బడుగు, బలహీన వర్గాలకు రుణ రాయితీలను ప్రభుత్వం పెంచింది. ఎస్సీ,ఎస్టీలకు ఇప్పటివరకూ బ్యాంకు రుణంలో 50 శాతం లేదా గరిష్టంగా 30 వేలు సబ్సిడీ ఇస్తున్నారు. ఇకపై దీనిని 60 శాతం లేదా గరిష్టంగా రూ.లక్ష వరకూ రాయితీ ఇవ్వనున్నారు. బీసీలకు రుణంలో 50 శాతం లేదా గరిష్టంగా రూ.లక్ష సబ్సిడీ ఇస్తారు. జిల్లాలో 3,600 ఎస్సీ యూనిట్లకు, 4,900 బీసీ యూనిట్లకు రుణాలివ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఆయూ పథకాలకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 21 వరకూ మాత్రమే ఇచ్చారు.
కనికరించలేదు
Published Sun, Jan 5 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement