నరసాపురం (రాయపేట), న్యూస్‌లైన్ : జిల్లాలో హెలెన్ తుపాను ప్రభావంపై ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్‌కు ఫోన్ చేసిన ఆయన ఇక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తీరప్రాంత గ్రామాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయూలని, తుపాను బాధితులను అన్నివిధాలా ఆదుకోవాలని ఆదేశిం చారు. మత్స్యకా రులను బలవంతంగానైనా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అనంతరం విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ తుపాను ప్రభావంతో జిల్లాలో నెలకొన్న పరిస్థితులతోపాటు పునరావాస కేంద్రాల ఏర్పాటు, సహాయక చర్యలపై సీఎంకు వివరించామన్నారు. పునరావాస కేంద్రాల వద్ద జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పామని తెలిపారు.
అధికారులతో సమీక్ష
సహాయక చర్యల విషయమై కలెక్టర్ సిద్ధార్థజైన్ మునిసిపల్ కార్యాలయంలో జిల్లా అధికారులతో శుక్రవారం సమీక్షించారు. బియ్యపుతిప్ప ఏటిగట్టు పటిష్టతకు 500 ఇసుక బస్తాలను తక్షణం ఏర్పాటు చేయాలని కన్జర్వెన్సీ అధికారులను ఆదేశించారు. తీరప్రాంత గ్రామాల్లో వైద్య బృందాలు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. రోడ్లపై కూలిన చెట్లను తక్షణమే తొలగించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లకు సూచించారు. ఉదయం నుంచి పొక్లెరుున్లతో కూలిన చెట్లను తొలగించే పనిని అధికారులు చేపట్టారు. సాయంత్రానికల్లా నేలకూలిన విద్యుత్ స్తంభాలను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్న బాధితులకు ఎటువంటి అసౌకర్యం కలుగుకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
తుపాను ప్రభావంపై సీఎం ఆరా
Published Sat, Nov 23 2013 5:04 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM
Advertisement