State Bankers Committee
-
రుణమాఫీ అమలు జరిగేనా..?
-
ఆర్బీఐ చెబితేనే రీషెడ్యూల్
* రుణాల రీషెడ్యూలుపై చంద్రబాబుకు బ్యాంకర్ల స్పష్టీకరణ సాక్షి, దరాబాద్: ఎన్నికల ప్రచారం సందర్భంగా వ్యవసాయ రుణాలన్నిటినీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆ రుణ మాఫీపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ విజ్ఞప్తి చేసినా మాఫీ మాటను దాటవేసి, రీషెడ్యూల్ రాగమే వినిపించారు. రుణాల తిరిగి చెల్లింపులు లేకపోవటంతో బ్యాంకులు సక్రమంగా పనిచేయలేకపోతున్నాయని, రైతులు రుణాలు చెల్లించకపోతే ఖరీఫ్ రుణాలు ఇవ్వలేమని ఎస్ఎల్బీసీ భేటీలో బ్యాంకర్లు స్పష్టంచేసినా.. ఆ రుణాలను రీషెడ్యూల్ చేసి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు తప్పితే మాఫీపై స్పష్టత ఇవ్వలేదు. రుణాలను రీషెడ్యూలు చేయాలంటే భారతీయ రిజర్వు బ్యాంకు అనుమతి అవసరమని బ్యాంకర్లు చెప్తే.. రీషెడ్యూలు చేయాల్సిందిగా తీర్మానం చేసి ఆర్బీఐకి పంపించాలని చంద్రబాబు సూచించారు కానీ.. మాఫీకి తమ ప్రణాళిక ఏమిటో చెప్పలేదు. పైగా.. రుణాలు రీషెడ్యూలు చేశాక వాటిపై ఏడాదిపాటు మారటోరియం విధించాలని, తిరిగి చెల్లించానికి 3 నుంచి 7 ఏళ్ల గడువు ఇవ్వాలనీ చంద్రబాబు కోరటం విశేషం. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతుల రుణాలను రీషెడ్యూలు చేయాలని సీఎం విజ్ఞప్తి చేయగా.. బ్యాంకర్ల నుంచి సానుకూల స్పందన రాలేదు. రుణాలు రీషెడ్యూలు చేయడానికి ఆర్బీఐ అనుమతి అవసరమని, ప్రభుత్వ విజ్ఞప్తిని ఆర్బీఐకి నివేదించి అక్కడ నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేస్తామని బ్యాంకర్లు సమాధానం ఇచ్చారు. మాఫీ కంటే రీ షెడ్యూల్‌పైనే దృష్టి... రైతుల రుణ మాఫీ ఎలా అమలు చేయనున్నారన్న అంశంకన్నా ప్రభుత్వం రుణాల రీషెడ్యూలుపైనే భేటీలో బాబు ప్రధానంగా దృష్టిపెట్టారు! కరువు, తుపాన్లు వచ్చిన 90 రోజుల్లోగా రుణాలు రీషెడ్యూలు చేయాలనే నిబంధనను పరిగణనలోనికి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ని 113 కరువు, 462 తుపాను బాధిత మండలాలతో పాటు మిగతా 86 మండలాల్లోనూ రుణాల రీషెడ్యూలు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. దీన్ని ఆర్ఐ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకెళ్తానని ఆర్బీఐ ప్రాంతీయ డెరైక్టర్ కె.ఆర్.దాస్ చెప్పా రు. నిర్ణీత గడువు తర్వాత రీషెడ్యూలు చేస్తే బ్యాంకులకు ఇ బ్బందులు ఉంటాయన్నారు. రుణాల రీషెడ్యూలుపై నిర్ణ యం వచ్చే వరకు కొంత సమయం పడుతుందని, ఆలో గా రైతులు రుణాలు చెల్లించి తాజా రుణాలు పొందాలని, రుణా లు చెల్లించిన వారికీ మాఫీ వర్తిస్తుందని ప్రకటన చేయాలని బాబుకు ఎస్ఎల్బీసీ చైర్మన్ రాజేంద్రన్ విజ్ఞప్తి చేశారు. రుణాల చెల్లింపు 3-7 ఏళ్ల గడువివ్వండి... రుణమాఫీ హామీ అమలుకు కట్టుబడ్డామని చంద్రబాబు అన్నారు. ‘‘రుణాలు సకాలంలో చెల్లించిన వారీకీ మాఫీ వర్తింపజేస్తాం. బంగారంపై తీసుకున్న రుణాలు రద్దు చేస్తాం. రుణాలు చెల్లించడానికి రైతులు సిద్ధమైతే సంతోషం. లేదంటే బలవంతంగా వసూలు చేయడానికి బ్యాంకులు చర్యలు చేపట్టకుండా సంయమనం పాటించాలి. హామీ అమలుకు ఏదో మార్గం కనుగొంటాం. ముందు రీషెడ్యూలు చేస్తే బ్యాంకుల కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. తర్వాత ఏదొకటి చేస్తాం’’ అని విజ్ఞప్తి చేశారు. రీషెడ్యూలు చేసిన తర్వాత ఏడాది పాటు రుణాల వసూళ్ల మీద మారిటోరియం ఉండాలని, రుణాలు తిరిగి చెల్లించడానికి 3 నుంచి 7 ఏళ్ల గడువు ఇవ్వాలని కోరారు. ఏపీ వార్షిక రుణ ప్రణాళిక రూ. 91,459 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 91,459 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఖరారు చేసింది. ఇందులో ప్రాధాన్యత రంగాలకు రూ. 77,894 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రుణాల కింద మొత్తం రూ. 56,019 కోట్లు కేటాయించారు. ఇందులో స్వల్పకాలిక రుణాల కింద రూ. 41,978 కోట్లు, టర్మ్ లోన్స్, వ్యవసాయ అనుబంధ రుణాల కింద రూ. 14,041 కోట్లు కేటాయించారు. -
గంపెడాశలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న వేళ కష్టజీవుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ చేసిన రూ.లక్షలోపు రుణమాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం రాజకీయ పార్టీల ప్రధాన బాధ్యత. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ ‘రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ’ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. తాజాగా ఆ పార్టీ అధికార పగ్గాలు చేపట్టనుండడంతో ఖరీఫ్‌లో రుణమాఫీతో కొంతైనా ఊరట లభిస్తుందని అన్నదాతలు భావిస్తున్నారు. మరోవైపు రుణమాఫీ అంశంపై బ్యాంకర్లలోనూ హడావుడి మొదలై ంది. ఎస్ఎల్బీసీ (రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ) రైతుల రుణాల లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రిన్సిపల్ బ్యాంకులకు మార్చి 31, 2014 నాటికి మంజూరు చేసిన రుణాల వివరాలు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో క్షేత్రస్థాయిలో రైతులకిచ్చిన రుణాల వివరాలపై బ్యాంకు అధికారులు కుస్తీ మొదలుపెట్టారు. ఏ కేటగిరీ ఎంతెంత? రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించినప్పటికీ.. వాటికి సంబంధించిన నిబంధనలపై స్పష్టత లేదు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే రుణమాఫీ అమలుకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే అప్పటికప్పుడు సమాచార సేకరణ కష్టమవుతుందని భావించిన బ్యాంకర్లు ముందస్తుగా వివరాలను తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. సాధారణంగా రైతులకు రెండు ప్రధాన విభాగాల్లో రుణాలిస్తారు. స్వల్పకాలక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు. ఈ రెండు కేటగిరీల్లో ఇచ్చిన రుణాలు ఎంత ఉన్నాయన్న విషయంపై అధికారులు లెక్కలు తీస్తున్నారు. ప్రస్తుతం జిల్లా గ్రామీణ పరిధిలో 360 ప్రభుత్వరంగ బ్యాంకులున్నాయి. ఈ బ్యాంకుల రుణవితరణకు సంబంధించిన సమాచార సేకరణలో లీడ్ బ్యాంకు అధికారులు నిమగ్నమయ్యారు. ఈ మేరకు బ్యాంకులన్నింటికీ లేఖలు రాసిన ఎల్డీఎం త్వరలో జరిగే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) సమావేశం నాటికీ రుణాల వివరాలను అందచేయాలని నిర్దేశించారు. అయితే, ఇప్పటివరకు ప్రాథమికంగా రూ.18 కోట్ల మేర ప్రభుత్వరంగ బ్యాంకులు రైతులకు అప్పులు ఇచ్చినట్లుగా గుర్తించారు. బ్యాంకుల వారీగా స్పష్టమైన రుణ సమాచారం అందేందుకు కొంత సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. పీఏసీఎస్‌ల ‘లెక్క తేలింది’.. ప్రధాన బ్యాంకుల రుణాలకు సంబంధించి రుణాల లెక్కలపై స్పష్టత రాలేదు. ఆయా బ్యాంకుల్లో పని ఒత్తిడి, మరోవైపు లీడ్ బ్యాంక్ మేనేజర్(ఎల్డీఎం) మారడంతో వివరాల అంశం కొలిక్కి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండగా.. హైదరబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (హెచ్‌డీసీసీబీ) పరిధిలోని పరపతి సంఘాలు ఇచ్చిన రుణాల లెక్క కొలిక్కి వచ్చింది. హెచ్‌డీసీసీబీ పరిధిలో 49 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలున్నాయి. వీటి పరిధిలో స్వల్పకాలిక రుణాల కోటాలో 53,394 మంది రైతులకు రూ.148.37కోట్ల రుణాలు మంజూరు చేశారు. అదేవిధంగా దీర్ఘకాలిక రుణాల కోటాలో 16,295 మంది రైతులకు రూ.76.17కోట్లు ఇచ్చారు. అదేవిధంగా నేరుగా ఇచ్చిన రుణాల కోటాలో రూ. 5.14కోట్ల రుణాలిచ్చారు. మొత్తంగా రూ.229.68 కోట్ల రుణాలిచ్చినట్టు తేలింది. ఈ మేరకు వివరాలను ప్రభుత్వానికి సమర్పించినట్లు ఆ బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి కొండ్రు రాందాస్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
కనికరించలేదు
సాక్షి, ఏలూరు : అన్నదాతల ఆశలపై ప్రభుత్వం మరోసారి నీళ్లు చల్లింది. పంట రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకు ముందుకొచ్చిన సర్కారు.. గత రుణ మొత్తాలపై వడ్డీ రారుుతీకి మంగళం పాడింది. రుణాలను రీ షెడ్యూల్ చేసుకునే రైతులు భారీ వడ్డీ చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో పంట రుణాల రీషెడ్యూల్ అంశంపైచర్చించినప్పటికీ, వడ్డీ రాయితీ అంశాన్ని పట్టించుకోలేదని సమాచారం అందింది. వరుస తుపానులకు పంటలు నష్టపోయిన రైతులు ఖరీఫ్‌లో బ్యాం కుల నుంచి తీసుకున్న పంట రుణాలను ఇప్పట్లో చెల్లించనవసం లేకుండా రీషెడ్యూల్ చేస్తామని బ్యాంకులు చెబుతున్నారుు. దీనివల్ల జిల్లాలోని దాదాపు 1.82 లక్షల మంది రైతులకు చెందిన దాదాపు రూ.443.25 కోట్ల రుణాల చెల్లింపునకు మూడేళ్ల గడువు లభిస్తుంది. అరుుతే, స్వల్పకాలిక రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా మార్పు చేయడం వల్ల రైతులు వడ్డీ రాయితీ పొందే అవకాశాన్ని కోల్పోతారు. సాధారణంగా రూ.లక్షలోపు పంట రుణంపై వడ్డీ ఉండదు. ఆపై నూటికి పావలా వడ్డీ వసూలు చేస్తారు. రీ షెడ్యూల్ చేయటం వల్ల రుణం ఎంత తీసుకున్నా 10 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది నీలం తుపాను ఖరీఫ్‌ను తుడిచి పెట్టేసినప్పుడు ఎస్ఎల్బీసీ సమావేశమై పంట రుణాలు రీషెడ్యూల్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. వడ్డీ రాయితీని మాత్రం కల్పించలేదు. ఈసారి కూడా గతేడాది నిర్ణయాన్నే కొనసాగించాలని ఎస్ఎల్బీసీ నిర్ణయించింది. వడ్డీలు చెల్లించలేమని, రీషెడ్యూల్ చేసుకున్న తర్వాత కూడా వడ్డీ రాయితీ వర్తింపజేయాలని రైతులు ఎంతగా వేడుకున్నప్పటికీ ప్రభుత్వం గాని, బ్యాంకర్లు గాని కనికరించలేదు. బడుగు, బలహీన వర్గాలకు రాయితీలు పెంపు బడుగు, బలహీన వర్గాలకు రుణ రాయితీలను ప్రభుత్వం పెంచింది. ఎస్సీ,ఎస్టీలకు ఇప్పటివరకూ బ్యాంకు రుణంలో 50 శాతం లేదా గరిష్టంగా 30 వేలు సబ్సిడీ ఇస్తున్నారు. ఇకపై దీనిని 60 శాతం లేదా గరిష్టంగా రూ.లక్ష వరకూ రాయితీ ఇవ్వనున్నారు. బీసీలకు రుణంలో 50 శాతం లేదా గరిష్టంగా రూ.లక్ష సబ్సిడీ ఇస్తారు. జిల్లాలో 3,600 ఎస్సీ యూనిట్లకు, 4,900 బీసీ యూనిట్లకు రుణాలివ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఆయూ పథకాలకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 21 వరకూ మాత్రమే ఇచ్చారు.