పెద్దవడుగూరు (తాడిపత్రి) : మండల పరిధిలోని దిమ్మగుడి గ్రామానికి చెందిన ఎంపీటీసీ మోహన్‌రెడ్డితో పాటు భాస్కర్‌రెడ్డి, సతీష్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ.రమణారెడ్డి తెలిపారు. తనను కులంపేరుతో దూషించాడని ఓబులేసు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
ఇదిలా ఉండగా తాను ఎవరినీ కులం పేరుతో దూషించలేదని ఎంపీటీసీ మోహన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ సమస్యలపై జన్మభూమి సభలో అధికారులను ప్రశ్నించగా తనపై కక్ష కట్టి ఇలా ఓబులేసుతో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారన్నారు.
ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
Published Fri, Jan 13 2017 10:47 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement
Advertisement