న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను సృష్టించిన చైనాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో (ఐసీజే) కేసు దాఖలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఈ వైరస్‌ను చైనా ఉద్దేశపూర్వకంగానే తయారు చేసిందని, నష్టపరిహారంగా 600 బిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేయాలని పిటిషనర్ కె.కె.రమేశ్ కోరారు. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి, వందలాది మరణాలకు కారణమవుతున్న కరోనా వైరస్ చైనాలోని ‘వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’లో రూపుదిద్దుకుంది అనేందుకు కచ్చితమైన ఆధారాలున్నాయని ఆ పిటిషన్‌లో రమేశ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment