'బడ్జెట్'లో కళ్యాణలక్ష్మీకి ప్రత్యేక నిధులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో కళ్యాణలక్ష్మీ పథకానికి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రత్యేకంగా నిధులను కేటాయించారు. కళ్యాణ లక్ష్మీ పథకంలో ఎస్సీలకు 150 కోట్లు, ఎస్టీలకు 80 కోట్లు కేటాయించారు.
2014-19 వరకు ఎస్సీల అభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈటెల తన ప్రసంగంలో తెలిపారు.
ఎస్సీల సబ్ ప్లాన్ కు 7579 కోట్లు, ఎస్టీల సబ్ ప్లాన్ కు 4559 కోట్లు, బీసీల సంక్షేమానికి 2022 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 1030 కోట్ల కేటాయింపు జరిగింది.