నిరాశాజనకంగా తెలంగాణ బడ్జెట్: ఉత్తమ్ కుమార్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెదవి విరిచారు. తెలంగాణ బడ్జెట్ నిరాశజనకంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం విధానమేంటో బడ్జెట్ లో తెలుపలేదని ఆయన అన్నారు. నిధుల కేటాయింపులు అసమంజసంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పాలనను నిందించడం తప్పితే, బడ్జెట్ లో కొత్త ఒరవడి లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
ఇతర ప్రభుత్వాలను విమర్శించడమే ఏకైక లక్ష్యంగా బడ్జెట్ ప్రసంగం కొనసాగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన పథకాలను ఈ బడ్జెట్ లో పెట్టుకోవడం చాలా దారుణమన్నారు. అర్హులైన పెన్షన్ దారులను తగ్గిస్తే ఊరుకోమని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.