గత ప్రభుత్వాల తప్పులను సరిదిద్దుతాం: ఈటెల
హైదరాబాద్: తెలంగాణ శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం తనకు గర్వంగా ఉందని ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సమైక్య రాష్ట్రంలోని శాసనసభలో అనేక అవమానాలకు గురయ్యాం. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి.. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన ప్రజలందరికి ధన్యవాదాలు అంటూ ఆర్ధిక మంత్రి తన ప్రసంగాన్ని ఆరంభించారు.
బంగారు తెలంగాణ సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. వలసవాదుల ఆరోపణల్ని సమర్ధంగా ఎదుర్కొంటాం. గత ప్రభుత్వాల తప్పులను సరిదిద్దుతాం. అమరవీరులు చిరస్మరణీయులు. అమరుల త్యాగాలను తెలంగాణ ఎప్పడూ మరిచిపోరు. అమరుల కుటుంబాలకు పది లక్షల ఆర్ధిక సహాయం అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని ఈటెల అన్నారు.