కర్నూలు జిల్లా ఆదోని మండల కేంద్రంలోని సెయింట్ ఆంథోని స్కూల్‌లో ఆరోతరగతి చదువుతున్న సున్మిత అనే బాలిక కనిపించకుండా పోయింది.
ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని మండల కేంద్రంలోని సెయింట్ ఆంథోని స్కూల్‌లో ఆరోతరగతి చదువుతున్న సున్మిత అనే బాలిక కనిపించకుండా పోయింది. శనివారం రాత్రి 9 గంటల సమయంలో స్కూల్ హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన సున్మిత తిరిగి రాలేదు. ఆదివారం పాప ఆచూకీ తెలియకపోవడంతో స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం సంయుక్తంగా స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా, శనివారం రాత్రి బాలిక హాస్టల్ వెనుక గేటు నుంచి వెళ్లిపోయిందని తోటి స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక బాలిక ఎవరికీ సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.