బయో గ్యాస్ ప్లాంట్ నిర్మించుకోవాలి | Bio-gas plant Build | Sakshi
Sakshi News home page

బయో గ్యాస్ ప్లాంట్ నిర్మించుకోవాలి

Published Wed, Nov 30 2016 1:39 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

Bio-gas plant Build

 టేక్మాల్ : పాడిపశువులు ఉన్న ప్రతి ఒక్కరూ బయోగ్యాస్ ప్లాంట్‌లను నిర్మించుకోవాలని బయోగ్యాస్ సంయుక్త జిల్లాల మేనేజర్ రామేశ్వర్ తెలిపారు. మండల పరిధిలోని ఎల్లంపల్లి మధిర గ్రామమైన సర్మోనికుంట తండాలో మంగళవారం బయోగ్యాస్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువ పశువులు ఉన్న రైతులు బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించుకుంటే ఇంధనవనరులను కాపాడిన వారవుతారన్నారు. వీటి నిర్మాణానికి రూ.20,100 ఖర్చవుతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.11వేల సబ్సిడీ ఉందని, ఉపాధిహామీ నుంచి మరో రూ.5వేలు ఇస్తుందని చెప్పారు. నిర్మించుకునే రైతు రూ.1500లను ముందుగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందన్నారు.  ఈ సమావేశంలో ఎంపీడీఓ విష్ణువర్దన్, తహసీల్దార్ ముజాఫర్ హుస్సేన్, సర్పంచ్ రామయ్య, నాయకులు రమేశ్‌నాయక్, నరేందర్, ఉపాధిహామీ సిబ్బంది తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement