నల్లగొండ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కా ర్పొరేషన్ లబ్ధిదారులకు సంబంధించిన ఈ నెల మొదటి వారంలో ప్రభుత్వం సబ్సిడీ (బడ్జెట్) విడుదల చేయనున్నుట్ల ఏజేసీ వెంకట్రావు తెలిపారు. శుక్రవారం తన చాంబర్‌లో వివిధ బ్యాంక్‌ల జిల్లా మేనేజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ వర్గాలకు చెందిన లబ్ధిదారుల రుణాల విషయంలో జాప్యం చేయొద్దని, వారి ద రఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సూ చించారు. బ్యాంకర్లు లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగించకుండా రుణాలు మంజూరు చేయూలని సూచించారు.
అర్బన్ మున్సిపాలిటీ స్వయం ఉపా ధి పకం ద్వారా రుణాల విషయంలో లబ్ధిదారులు సంబంధిత ధ్రువపత్రాలు ఖచ్చితంగా సమర్పిస్తే లోన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని బ్యాంకు అధికారులు తెలిపారు. సమభావన సంఘాల రుణాలలో అవకతవకలు జరుగుతున్నాయని బ్యాంకర్లు డీఆర్‌డీఏ పీడీ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ అంజయ్య, ఎల్.డి.యం శ్రీధర్, బీసీ కార్పొరేషన్ ఈడీ వేణుగోపాల్‌రావు, గ్రౌండ్ వాటర్ డీడీ జితేందర్, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.
మొదటి వారంలో సబ్సిడీ విడుదల
Published Sat, Jul 2 2016 3:07 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement
Advertisement