ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నారిటీ సంక్షేమ శాఖల ద్వారా లబ్ధిదారు లకు మంజూరైన పథకాల వివరాలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) పోర్టల్‌లో పొందుపరచాలని...
పొందుపరచాలని సీఎస్ ఆదేశం
సాక్షి,, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నారిటీ సంక్షేమ శాఖల ద్వారా లబ్ధిదారు లకు మంజూరైన పథకాల వివరాలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) పోర్టల్‌లో పొందుపరచాలని అధికారులను సీఎస్ ప్రదీప్‌చంద్ర ఆదేశించారు. మంజూరైన స్వయంఉపాధి, లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన పథకాల యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించాలన్నారు. మంగళ వారం సచివాలయంలో సంక్షేమ శాఖల్లో స్వయం ఉపాధి పథకాల అమలు తీరును సీఎస్ సమీక్షించారు.
గుడుంబా బాధిత కుటుంబాలకు స్వయంఉపాధి కల్పన కోసం నిధులు మంజూరు చేయాలని ఆదే శించారు. సంక్షేమానికి సంబంధించి ప్రతి శాఖ ద్వారా హాబిటేషన్లు, లబ్ధిదారుల వారీగా వివరాల సేకరణ, శాఖల వారీగా స్వయం ఉపాధి పథకాల మంజూరీని సమీక్షిస్తూ నెలవారీ కార్యాచరణ రూపొం దించుకోవాలన్నారు. అధికారులు అజయ్ మిశ్రా, సోమేశ్‌కుమార్,జలీల్, సందీప్ కుమార్, అరుణ, లక్ష్మణ్ పాల్గొన్నారు.