సమావేశంలో మాట్లాడుతున్న సీఐ వెంకటేశ్వర్లు
మధిర : ఇటీవల పలు మండలాల్లో వరుస చోరీలకు పాల్పడిన కంభంపాటి ఏసోబును బుధవారం మధిర రూరల్ ఎస్సై బండారి కిషోర్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా స్థానిక రూరల్ పోలీస్ స్టేష¯ŒSలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నూనె వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఆత్కూరు గ్రామానికి చెందిన ఏసోబు ఇటీవల మధిర మండలంలోని మాటూరు, వంగవీడు, నాగవరప్పాడు, వైరా మండలంలోని పాలడుగుతోపాటు బోనకల్, ఎర్రుపాలెం, కొణిజర్లలో వరుస చోరీలకు పాల్పడ్డాడు. మాటూరు క్రాస్ రోడ్డు వద్ద రూరల్ ఎస్సై కిషోర్ వాహనాలను తనిఖీ చేస్తుండగా గమనించిన ఏసోబు గంపలగూడెంవైపు తన బైక్‌ను ఆపకుండా పరారయ్యేందుకు ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల విషయం తెలిసింది. అతడి నుంచి మోటారు సైకిల్, వెండి పట్టీలు, బంగారపు ఉంగరాలు, రూ.17,600 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం రూ.లక్ష విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశామని సీఐ పేర్కొన్నారు. సమావేశంలో రూరల్ ఎస్సై బండారి కిషోర్ పాల్గొన్నారు.