ఇల్లు కూల్చి.. శిథిలాలు వాగులో కలిపి.. | TDP Rowdies Attack on ST family: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఇల్లు కూల్చి.. శిథిలాలు వాగులో కలిపి..

Published Tue, Aug 20 2024 5:03 AM | Last Updated on Tue, Aug 20 2024 5:03 AM

TDP Rowdies Attack on ST family: Andhra pradesh

ఎస్టీ కుటుంబంపై టీడీపీ వర్గీయుల దాష్టీకం

వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారని కక్ష

చిలకలూరిపేట: వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారని కక్షకట్టి.. ఏకంగా ఇల్లు కూల్చి వేయడమే కాక.. ఆ శిథిలాలను వాగులో కలిపి టీడీపీ నేతలు పైశాచిక ఆనందం పొందారు. ఈ ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి ఎస్టీ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితులు ఉయ్యాల ఏడుకొండలు, కోటమ్మ దంపతుల కథనం మేరకు వివరాలు వారి మాటల్లోనే.. ‘మాది కూలీ నాలీ చేసుకుని బతికే కుటుంబం. ముగ్గురు సంతానం. అందరికీ వివాహాలు చేశాం. గ్రామంలో 2019లో ఖాళీ స్థలం కొనుగోలు చేసి రెండేళ్ల కిందట రేకులతో ఇల్లు నిర్మించుకుని ఉంటున్నాం.

మీరు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు అంటూ టీడీపీ వర్గీయులైన తన్నీరు గోవిందు, తన్నీరు వెంకట్రావు, తన్నీరు నారాయణ, తన్నీరు రాజు, కుంచెపు ప్రసన్న, శ్రీను, మరికొందరు జేసీబీ, ట్రాక్టర్‌పై ఎక్కి మా ఇంటిపై దాడికి వచ్చారు. కట్టుబట్టలతో ఇంట్లో ఉన్న మమ్మల్ని, మా మూడో కుమారుడు వెంకటేశ్వర్లును బయటకు తోశారు. ప్రభుత్వం మాది.. ఎవడు అడ్డం వస్తాడో చూస్తాం.. దిక్కున్న చోట చెప్పుకోండి.. అంటూ కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారు.

వారిని ఇంట్లో నుంచి బయటకు గెంటి జేసీబీతో ఇల్లు కూల్చారు. అనంతరం ఆ శిథిలాలను ట్రాక్టర్లో తీసుకెళ్లి వాగులో పడేశారు. కాళ్లవేళ్లా బతిమి­లా­డుకున్నా కనికరించలేదు. అనంతరం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాధితులు రూరల్‌ పోలీసుస్టేషన్‌కు వెళితే అక్కడ ఎస్‌ఐ పట్టించుకోలేదు. దీంతో సోమవారం నరసరావుపేట డీఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement