are
-
మరో ఆరుగురికి అస్వస్థత
మొత్తం 42 మంది బాలికలు ఆస్పత్రిపాలు కస్తూరిబా విద్యాలయలో అధికారుల విచారణ వై.రామవరం (రంపచోడవరం) : తోటకూరపాలెంలోని కస్తూరిబా బాలికల విద్యాలయంలో బాలికల అస్వస్థత ఘటన.. మిగిలిన విద్యార్థినులను హడలెత్తిస్తే.. అధికారులను పరుగులు పెట్టించింది. ఈ విద్యాలయంలో గురువారం మరో ఆరుగురికి విరేచనాలు కావడంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం తిన్న ఆహారం వికటించి 36 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతలకు గురైన విషయం విదితమే. దీంతో అస్వస్థతకు గురైన వారి సంఖ్య 42కు పెరిగింది. ఈ సంఘటనపై సర్వశిక్షా అభియాన్ జిల్లా పీఓ శేషగిరిరావు గురువారం విచారణ చేశారు. స్టోర్ రూమ్‌లోని ఆహార పధార్థాలను జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వై.పాండురంగరావు తనిఖీ చేశారు. అందరిలోనూ ఆందోళన.. విద్యాలయ ప్రత్యేకాధికారి (ప్రిన్సిపాల్) విజయకుమారి నిర్వాకమే ఈ సంఘటనకు కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడి మానేసిన బడిఈడు (డ్రాపౌట్స్) పిల్లల కోసం కస్తూరిబా బాలికల విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ చదువు కొనసాగిస్తున్న వారందరూ అసలే డ్రాపౌట్స్ కావడంతో ఈ సంఘటన వారిని బెంబేలెత్తిస్తుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ విద్యాలయంలో ప్రస్తుతం మొత్తం 130 మంది బాలికలు ఉన్నారు. పెత్తనం చెలాయిస్తున్న భర్త! ఈ విద్యాలయంలో ప్రత్యేకాధికారి విజయకుమారి భర్త పెత్తనం చలాయిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మహిళా ఉపాధ్యాయులే ఉన్న ఆ బాలికల విద్యాలయంలోకి పురుషులకు ప్రవేశం ఉండదు. అయితే అ నిబంధనలను తుంగలోకి తొక్కి, ఆయన విద్యాలయంలో యథేచ్ఛగా తిరుగుతుంటారని విద్యార్థినులు చెబుతున్నారు. ఒక మహిళా ఉపాధ్యాయిని నిర్వర్తించాల్సిన వార్డెన్ విధులను ఎస్ఓ భర్తే చేపట్టారన్న విమర్శలున్నాయి. సకాలంలో స్పందించారు... విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు సమాచారం తెలియగానే ఐటీడీఏ పీఓ దినేష్ కుమార్ వెంటనే వై.రామవరం చేరుకున్నారు. చవిటిదిబ్బలు పీహెచ్సీ వైద్యాధికారి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది సకాలంలో వైద్యం చేయడంతో విద్యార్థినులు ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డారని గ్రామస్తులు అంటున్నారు. సర్వశిక్షా అభియాన్ జిల్లా పీఓ శేషగిరిరావు, ఏజెన్సీ డీఈఓ హెచ్వీ ప్రసాద్, ఎంపీడీఓ కె.బాపన్నదొర, ఎంఈఓ కె.ప్రసాదబాబు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గొర్లె శ్రీకాంత్ తదితరులు బుధవారం రాత్రి నుంచి ఆస్పత్రిలో మకాం వేసి తగిన సేవలు అందించారు. -
దొంగ అరెస్టు
మధిర : ఇటీవల పలు మండలాల్లో వరుస చోరీలకు పాల్పడిన కంభంపాటి ఏసోబును బుధవారం మధిర రూరల్ ఎస్సై బండారి కిషోర్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా స్థానిక రూరల్ పోలీస్ స్టేష¯ŒSలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నూనె వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఆత్కూరు గ్రామానికి చెందిన ఏసోబు ఇటీవల మధిర మండలంలోని మాటూరు, వంగవీడు, నాగవరప్పాడు, వైరా మండలంలోని పాలడుగుతోపాటు బోనకల్, ఎర్రుపాలెం, కొణిజర్లలో వరుస చోరీలకు పాల్పడ్డాడు. మాటూరు క్రాస్ రోడ్డు వద్ద రూరల్ ఎస్సై కిషోర్ వాహనాలను తనిఖీ చేస్తుండగా గమనించిన ఏసోబు గంపలగూడెంవైపు తన బైక్‌ను ఆపకుండా పరారయ్యేందుకు ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల విషయం తెలిసింది. అతడి నుంచి మోటారు సైకిల్, వెండి పట్టీలు, బంగారపు ఉంగరాలు, రూ.17,600 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం రూ.లక్ష విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశామని సీఐ పేర్కొన్నారు. సమావేశంలో రూరల్ ఎస్సై బండారి కిషోర్ పాల్గొన్నారు. -
నేడు పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు
గుంటూరు (నగరంపాలెం) : సత్తెనపల్లి, పిడుగురాళ్ల మధ్యలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాకు పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున శనివారం డివిజను పరిధిలో పలు రైళ్లు రద్దు చేశామని, మరికొన్ని దారి మళ్లించామని గుంటూరు రైల్వే డివిజను సీనియర్ డివిజనల్ మేనేజరు కె.ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ పరిధిలో 17 రైళ్లను రద్దు చేయగా 23 రైళ్లను న్యూగుంటూరు, గుంతకల్, ఖాజీపేట, మీదుగా దారిమళ్లించినట్లు పేర్కొ న్నారు. ట్రైన్ నం 57619 రేపల్లె–సికింద్రాబాద్, ట్రైన్lనం 57620 కాచిగూడ– రేపల్లె డెల్టా ప్యాసింజరు, ట్రైన్ నం 12795/12796 విజయవాడ– సికింద్రా బాద్– విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును యథావిధిగా నడుపుతున్నట్లు పేర్కొన్నారు. న్యూ గుంటూరు మీదుగా దారి మళ్లించిన రైళ్లు ట్రైన్నం 17229/17230 తివేండ్రమ్–హైదరాబాద్ – త్రివేండ్రమ్ శబరి ఎక్స్‌ప్రెస్, ట్రైన్ నం 12703/ 12704 చెన్నై–హైదరాబాద్–చెన్నై ఎక్స్‌ప్రెస్ ఖాజీ పేట, విజయవాడ మీదుగా న్యూగుంటూరు స్టేషను మీదుగా తెనాలి వైపునకు దారిమళ్లించామన్నారు. ఖాజీపేట, విజయవాడ వైపునకుదారిమళ్లించిన రైళ్లు ట్రైన్ నం 17016/17015 భువనేశ్వర్–సికింద్రా బాద్–భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్, ట్రైన్ నం 12704/12703 సికింద్రాబాద్– హౌరా – సికిం ద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, ట్రైన్ నం 17203 బావానగర్ – కాకినాడ టౌన్ ఎక్స్‌ప్రెస్, ట్రై న్ నం 12805/12806 విశాఖపట్నం– సికింద్రాబాద్– విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్, ట్రైన్నం 17255/17256 నర్సాపూర్–హైద్రాబాద్– నర్సా పూర్, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, ట్రైన్ నం 07418 నాగ ర్సోల్–తిరుపతి స్పెషల్ ఎక్స్‌ప్రెస్, ట్రైన్ నం 22832 సత్యసాయి ప్రశాంతి నిలయం–హౌరా ఎక్స్‌ప్రెస్ ఖాజీపేట మీదుగా విజయవాడ వైపు దారిమళ్లించారు. యథావిధిగా విజయవాడ మార్గంలో నడుస్తున్న రైళ్లు విజయవాడలో సిగ్నలింగ్ పనుల కారణంగా గుం టూరు డివిజను మీదుగా సికింద్రాబాద్ వైపు దారి మళ్లించిన ట్రైన్ నం 17405/17406 తిరుపతి – ఆదిలాబాద్–తిరుపతి కష్ణా ఎక్స్‌ప్రెస్, ట్రైన్ నం 12705/12706 సికింద్రాబాద్– గుంటూరు– సికిం ద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, 12764/12763 సికింద్రాబాద్– తిరుపతి– సికింద్రాబాద్ పద్మవతి ఎక్స్‌ప్రెస్ యథావిధిగా ఖాజీపేట మీదుగా విజయ వాడ వైపునకు నడుస్తున్నాయి. -
అందరూ ఉన్నా అనాథలా అవ్వ
ఐదుగురు కొడుకులున్నా పట్టించుకోని వైనం నిరాహారదీక్షతో తనువు చాలించిన దైన్యం అశ్వాపురం: ఐదుగురు కొడుకులున్నా ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడంతో తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన 80 ఏళ్ల వృద్ధురాలు కందిమళ్ల సరోజనమ్మ గురువారం మృతిచెందారు. రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఆమె ఆరోగ్యం గురువారం నాటికి పూర్తిగా క్షీణించింది. అటు అధికారులు కూడా స్పందించకపోవడంతో ఆమెకు మరణమే శరణ్యమైంది. వివరాల్లోకి వెళ్తే.. సరోజనమ్మకు ఐదుగురు కొడుకులతో పాటు ముగ్గురు కుమార్తెలు. ఈ ఐదుగురు కుమారుల్లో ఎవరూ పట్టించుకోవడం లేదు. మూడో కుమారుడు కందిమళ్ల కృష్ణారెడ్డి తల్లి సరోజనమ్మ పేరిట ఉన్న ఎనిమిదిన్నర ఎకరాల భూమిలో నాలుగు ఎకరాలు ఆమెకు తెలియకుండా నకిలీ సంతకాలతో పట్టా చేయించుకున్నాడు. తన భూమిని తనకు ఇప్పించడంతో పాటు కొడుకులు పోషణ బాధ్యత చూసే విధంగా చర్యలు తీసుకోవాలని సరోజనమ్మ బుధవారం నుంచి నిరాహారదీక్ష చేపట్టింది. అన్నపానీయాలు మాని దీక్ష చేస్తుండటంతో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించి సొమ్మసిల్లి పడిపోయింది. కుటుంబసభ్యులు, స్థానికులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గ్రామస్తుల ఆగ్రహం రెండురోజులుగా 80 ఏళ్ల వృద్ధురాలు పంచాయతీ ఆఫీసు ఎదుట ఆందోళన చేస్తుంటే కుటుంబసభ్యులు, అధికారులు స్పందించపోవడంపై మొండికుంట గ్రామస్తులు మండిపడ్డారు. అధికారులు ఆ వృద్ధురాలి సమస్య ఏమిటో కూడా తెలుసుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘అంతా’ పులకించే..
భద్రాద్రిలో వైభవంగా ప్రారంభమైన గోదావరి అంత్య పుష్కరాలు తొలి రోజు 30 వేలమంది పుణ్యస్నానాలు భక్తుల జయజయధ్వానాలతో మార్మోగిన తీరం ప్రవిత్ర స్నానం, రామయ్య దర్శనంతో పునీతం పుష్కర స్నానమాచరించిన హైకోర్టు జడ్జి గోదారమ్మకు శాస్త్రోక్తంగా నదీ హారతి గోదావరి తీరం పులకించింది. భక్తుల జయజయధ్వానాలతో మార్మోగింది. ఊరేగింపు, పూజలు, పుణ్యస్నానాలతో సందడిగా మారింది. భద్రాద్రిలో గోదావరి అంత్య పుష్కరాలు ప్రారంభమైన వేళ.. వేలాది మంది భక్తులు జై శ్రీరామ్ అంటూ పుష్కరస్నానమాచరించారు. పిండప్రదానాలు చేసి.. పితృతర్పణాలు వదిలారు. వేదపండితుల మంత్రోచ్ఛరణ.. ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాలు.. భక్తజనం తోడు రాగా.. సుందరంగా అలంకరించిన లాంచీపై స్వామివారిని ఆశీనుల చేశారు. ఆదివారం ప్రారంభమైన గోదావరి అంత్య పుష్కర వేడుక 11వ తేదీతో ముగుస్తుంది. వేలాది భక్తుల పుణ్యస్నానాలతో గౌతమి తీరం శోభాయమానంగా కనిపించింది. సాయంత్రం నదీ హారతితో మరింతగా కాంతులీనింది. భద్రాచలం : భద్రాచలంలో గోదావరి అంత్య పుష్కరాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కర ఘడియలు సమీపించగానే గోదావరి తీరం రామనామ స్మరణతో మార్మోగింది. పవిత్ర స్నానం ఆచరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావటంతో తీరం జన సందోహంగా మారింది. భద్రాద్రి ఆలయం నుంచి శ్రీసీతారామచంద్రస్వామివారి ప్రచార మూర్తులు, చక్రపెరుమాళ్లు, శ్రీపాదుకలు, శ్రీభగవద్రామానుజాచార్య స్వామి వారులతో ఊరేగింపుగా వెళ్లారు. మెట్లరేవు వద్ద ఉన్న గోదావరి మాత విగ్రహానికి ఈఓ రమేష్‌బాబు పూజలు చేసి, నూతన వస్త్రాలను సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణ, దేవస్థానం ఆస్థానవిద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ.. భక్తజనం తోడుగా గోదావరి తీరానికి చేరుకున్నారు. సుందరంగా అలంకరించిన లాంచీపై అన్నింటినీ ఆశీనుల చేశారు. శ్రీరామానుజాస్వామివారికి అభిషేకం.. ఆపై పుష్కరస్నానం శ్రీరామానుజాచార్యస్వామి వారికి అభిషేక కార్యక్రమంలో భాగంగా ముందు విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం గావించారు. గోదావరి అంత్య పుష్కరాల విశిష్టతను దేవస్థానం స్థానాచార్యులు కేఈ స్థలశాయి వివరించారు. శ్రీరామానుజాచార్యస్వామి వారికి గోదావరి జలాలతో అభిషేకం జరిపారు. గోదారమ్మకు పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, దుస్తులు సమర్చించారు. మంగళ హారతులు ఇచ్చారు. శ్రీపాదుకలతో అర్చకులు, వేద పండితులు, భక్తజనం తోడుగా సామూహికంగా పుష్కర స్నానమాచరించారు. ఆ సమయాన గోదావరి తీరంలో ఉన్న భక్తులంతా జై శ్రీరామ్ అంటూ పుష్కర స్నానం చేశారు. భక్తులు గోదావరి ఒడ్డున ప్రత్యేక పూజలు చేసి, గోదారమ్మకు హారతులు ఇచ్చి దీపాలను వదిలారు. పునర్వసు మండపంలో కొలువుదీరిన స్వామి గోదావరి తీరంలోని పునర్వసు మండపంలో శ్రీసీతారాముల వారి ప్రచార మూర్తులను ఉంచారు. అంత్య పుష్కరాలను ప్రారంభించిన అనంతరం చక్రపెరుమాళ్లు, శ్రీపాదుకలు, శ్రీభగవద్రామానుజార్యులను పునర్వసు మండపానికి తీసుకొచ్చి కొద్ది సేపు ఆశీనుల చేశారు. పునర్వసు మండపంలో ఉంచిన స్వామివారి మూర్తులకు స్నపన తిరుమంజనం గావించి.. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అంత్య పుష్కరాలకు వచ్చి రామాలయాన్ని దర్శించుకోకుండానే వెనుదిరిగి వెళ్లే భక్తుల కోసం ఈ ఏర్పాటు చేశారు. గోదావరి తీరంలో భక్తజన సందడి అంత్యపుష్కరాల మొదటి రోజు ఆదివారం సుమారు 30 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. స్నానాలు ఆచరించిన భక్తులు గోదారమ్మకు పూజలు చేశారు. నదిలో పసుపు, కుంకుమ, దీపాలను వదిలారు. పితృదేవతలకు పిండప్రదానం చేశారు. పుష్కరాల ప్రారంభంతో గోదావరిలో పుణ్య స్నానాలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఈ నెల 11 వరకు అంత్య పుష్కరాలు నిర్వహించనున్న నేపథ్యంలో భక్తుల రాక పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి ఘాట్‌లో ఎటువంటి ప్రమాదం జరగకుండా గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు గస్తీ తిరుగుతున్నారు. పుష్కర స్నానమాచరించిన హైకోర్టు జడ్జి అంత్య పుష్కరాల్లో పాల్గొనేందుకు భద్రాచలం వచ్చిన రాష్ట్ర హైకోర్టు జడ్జి దుర్గాప్రసాద్ పుణ్యస్నానమాచరించారు. ఆయనతో పాటు జిల్లా జడ్జి విజయ్‌మోహన్, భద్రాచలం ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ బులికృష్ణ ఉన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హనుమంతు గోదావరికి పూజలు చేశారు. వారిని అర్చకులు ఆశీర్వదించారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బేగ్ తదితరులు పుష్కర స్నానం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ రమేష్‌బాబు, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, ఇరిగేషన్ శాఖ ఈఈ ప్రసాద్, భద్రాచలం సర్పంచ్ భూక్యా శ్వేత, తహశీల్దార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వైభవంగా నదీ హారతి అంత్య పుష్కరాల్లో భాగంగా గోదారమ్మకు ఆదివారం రాత్రి వైభవంగా నదీ హారతి ఇచ్చారు. ఆలయం నుంచి ఊరేగింపుగా అర్చకులు, వేదపండిపతులు గోదావరి తీరానికి చేరుకున్నారు. లాంచీ ఎక్కి ఈఓ రమేష్‌బాబు గోదారమ్మకు పూజలు నిర్వమించారు. అనంతరం శాస్త్రోక్తంగా నదీ హారతి ఇచ్చారు.