నేడు పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు | trains are running other root today | Sakshi
Sakshi News home page

నేడు పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు

Published Fri, Sep 23 2016 11:55 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM

నేడు పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు

నేడు పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు

గుంటూరు (నగరంపాలెం) : సత్తెనపల్లి, పిడుగురాళ్ల మధ్యలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాకు పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున శనివారం డివిజను పరిధిలో పలు రైళ్లు రద్దు చేశామని, మరికొన్ని దారి మళ్లించామని గుంటూరు రైల్వే డివిజను సీనియర్‌ డివిజనల్‌ మేనేజరు కె.ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్‌ పరిధిలో 17 రైళ్లను రద్దు చేయగా 23 రైళ్లను న్యూగుంటూరు, గుంతకల్, ఖాజీపేట, మీదుగా దారిమళ్లించినట్లు పేర్కొ న్నారు. ట్రైన్‌ నం 57619 రేపల్లె–సికింద్రాబాద్, ట్రైన్‌lనం 57620 కాచిగూడ– రేపల్లె డెల్టా ప్యాసింజరు, ట్రైన్‌ నం 12795/12796 విజయవాడ– సికింద్రా బాద్‌– విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలును యథావిధిగా నడుపుతున్నట్లు పేర్కొన్నారు.

న్యూ గుంటూరు మీదుగా దారి మళ్లించిన రైళ్లు
ట్రైన్‌నం 17229/17230 తివేండ్రమ్‌–హైదరాబాద్‌ – త్రివేండ్రమ్‌ శబరి ఎక్స్‌ప్రెస్, ట్రైన్‌ నం 12703/ 12704  చెన్నై–హైదరాబాద్‌–చెన్నై ఎక్స్‌ప్రెస్‌  ఖాజీ పేట, విజయవాడ మీదుగా న్యూగుంటూరు స్టేషను మీదుగా తెనాలి వైపునకు దారిమళ్లించామన్నారు.

ఖాజీపేట, విజయవాడ వైపునకుదారిమళ్లించిన రైళ్లు
ట్రైన్‌ నం 17016/17015 భువనేశ్వర్‌–సికింద్రా బాద్‌–భువనేశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్, ట్రైన్‌ నం 12704/12703 సికింద్రాబాద్‌– హౌరా – సికిం ద్రాబాద్‌ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, ట్రైన్‌ నం 17203 బావానగర్‌ – కాకినాడ టౌన్‌ ఎక్స్‌ప్రెస్, ట్రై న్‌ నం 12805/12806 విశాఖపట్నం– సికింద్రాబాద్‌– విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్, ట్రైన్‌నం 17255/17256 నర్సాపూర్‌–హైద్రాబాద్‌– నర్సా పూర్, నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్, ట్రైన్‌ నం 07418 నాగ ర్‌సోల్‌–తిరుపతి స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్, ట్రైన్‌ నం 22832 సత్యసాయి ప్రశాంతి నిలయం–హౌరా ఎక్స్‌ప్రెస్‌ ఖాజీపేట మీదుగా విజయవాడ వైపు దారిమళ్లించారు.

యథావిధిగా విజయవాడ మార్గంలో నడుస్తున్న రైళ్లు
విజయవాడలో సిగ్నలింగ్‌ పనుల కారణంగా గుం టూరు డివిజను మీదుగా సికింద్రాబాద్‌ వైపు దారి మళ్లించిన ట్రైన్‌ నం 17405/17406 తిరుపతి – ఆదిలాబాద్‌–తిరుపతి కష్ణా ఎక్స్‌ప్రెస్, ట్రైన్‌ నం 12705/12706 సికింద్రాబాద్‌– గుంటూరు– సికిం ద్రాబాద్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, 12764/12763 సికింద్రాబాద్‌– తిరుపతి– సికింద్రాబాద్‌ పద్మవతి ఎక్స్‌ప్రెస్‌ యథావిధిగా ఖాజీపేట మీదుగా విజయ వాడ వైపునకు నడుస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement