సూపర్ స్టార్ 'రజనీ కాంత్' రోబో సినిమా వచ్చిన తరువాత.. బహుశా రోబోలు ఇలాగే ఉంటాయేమో అని చాలామంది భావించారు. అయితే ఇటీవల టెస్లా రూపొందించిన నడిచే రోబోకు సంబందించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. ఇప్పుడు చైనా కంపెనీ ఏకంగా పరుగెత్తే రోబోను తయారు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
చైనీస్ కంపెనీ ‘రోబో ఎరా’ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హ్యూమనాయిడ్ రోబోను తయారు చేసింది. ‘స్టార్1’ పేరుతో రూపొందించిన ఈ రోబో శరవేగంగా పరుగులు తీయగలదు. ఇది గంటకు 8 మైళ్లు (12.98 కి.మీ.) వేగంతో పరుగెడుతోంది. ఈ రోబోకు హైటార్క్ మోటార్లు, ఏఐ సెన్సార్లు అమర్చడం వల్ల.. ఇది ఎలాంటి ఎగుడు దిగుడు దారుల్లోనైనా అదే వేగంతో పరుగెతూనే దాటేస్తుంది.
ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 40000 ఉద్యోగాలు
‘రోబో ఎరా’ చూడటానికి సగటు మనిషి పరిమాణంలోనే 5.6 అడుగుల ఎత్తు, 64.86 కేజీల బరువుతో ఉంటుంది. ఇలాంటి పరుగుల రోబోలను ‘టెస్లా’ కంపెనీ ‘ఆప్టిమస్’ పేరుతోను, ‘బోస్టన్ డైనమిక్స్’ కంపెనీ ‘అట్లాస్’ పేరుతోను రూపొందించాయి. అయితే, ‘రోబో ఎరా’ తాజాగా రూపొందించిన ‘స్టార్ 1’ వాటి కంటే వేగంగా పరుగులు తీయగలగడంతో, అత్యంత వేగవంతమైన రోబోగా రికార్డు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment