ఆ గుర్రం పరుగు గంటకు 100 కి.మీ.. రోజూ నెయ్యితో మాలిష్‌ | Horse Running Speed of 100 kmph Came to Soepur mela | Sakshi
Sakshi News home page

ఆ గుర్రం పరుగు గంటకు 100 కి.మీ.. రోజూ నెయ్యితో మాలిష్‌

Published Thu, Nov 21 2024 12:18 PM | Last Updated on Thu, Nov 21 2024 12:18 PM

Horse Running Speed of 100 kmph Came to Soepur mela

సోన్ పూర్ : బీహార్‌లో సోన్‌పూర్ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. ఆసియాలోనే అతిపెద్దదైన ఈ జంతు మేళాకు పలు ప్రత్యేకతలు కలిగిన జంతువులను వాటి యజమానులు తీసుకువచ్చారు. వాటిలో ఒకటి అనంత్ సింగ్ అలియాస్ ఛోటే సర్కార్‌కు చెందిన గుర్రం. దీని పేరు డార్లింగ్‌. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ గుర్రం చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ గుర్రం ఎంత వేగంతో పరిగెడుతుంతో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అలాగే దీని ధర వింటే ఒకపట్టాన ఎవరూ నమ్మలేరు.

గుర్రపు యజమాని రుడాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ  ఈ గుర్రం ఏకే 56 సింధీ జాతికి చెందినదనని తెలిపారు. ఇది యజమాని దగ్గర ఎంతో విధేయంగా మెలుగుతుందన్నారు. ఈ జాతికి చెందిన గుర్రాల సగటు ఎత్తు 64 అంగుళాలు. అయితే ‘డార్లింగ్‌’ ఎత్తు 66 అంగుళాలు. సాధారణ గుర్రాల నిర్వహణకు ప్రతినెలా రూ. 10 వేల వరకూ ఖర్చు అవుతుంది. అయితే ఈ ప్రత్యేక గుర్రం సంరక్షణకు ప్రతినెలా రూ.35 వేలు ఖర్చవుతుంది.

ఈ గుర్రాన్ని సంరక్షణలో దాని యజమాని రుడాల్‌ యాదవ్‌ ప్రత్యేక మెళకువలను అవలంబిస్తుంటాడు. ఈ గుర్రానికి ప్రతీరోజు  ప్రత్యేకమైన నెయ్యితో మాలిష్‌ చేస్తుంటాడు. ఈ గుర్రం వేగం విషయానికి వస్తే రికార్డులు తీరగరాయాల్సిందే. ఈ గుర్రానికి ఏడాది వయస్సు నుంచే పరుగులో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు రుడాల్‌ యాదవ్‌ తెలిపారు.  ఈ గుర్రం సాధారణంగా గంటకు 45 కి.మీ వేగంతో పరిగెడుతుంది. అయితే దీని పూర్తి వేగం గంటకు 100 కి.మీ.

నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం సింధీ జాతి గుర్రాలు ఓర్పు, చురుకుదనానికి ప్రసిద్ధి చెందాయి. గుర్రపు ప్రేమికులు ఈ జాతి గుర్రాలను అమితంగా ఇష్టపడుతుంటారు. దీని ధర విషయానికొస్తే గుర్రం యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఏకే 56’ ధర సుమారు రూ.1.11 కోట్లు.

ఇది కూడా చదవండి: దేశంలో తగ్గిన సంతానోత్పత్తి రేటు.. ప్రయోజనమా? ‍ప్రతికూలమా?

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement