నగరంలోని ఓ హాస్టల్ వద్ద యువతిపై యువకుడు దాడి చేయగా..
కరీంనగర్ క్రైం : నగరంలోని ఓ హాస్టల్ వద్ద యువతిపై యువకుడు దాడి చేయగా.. స్థానికులు అతడిని చితకబాదారు. నగరంలోని సెవెన్‌హిల్స్ వద్ద ఎస్టీ బాలిక హాస్టల్ ఉంది. శనివారం రాత్రి ఇద్దరు యువకులు అక్కడి రావడంతో హాస్టల్‌లో ఉంటున్న ముగ్గురు యువతులు వారిని కలిసేందుకొచ్చారు. ఓ యువకుడు, యువతి మధ్య వివాహానికి సంబంధించి మాటమాట పెరిగింది. కోపోద్రిక్తుడైన యువకుడు ఆ యువతిపై చేరుుచేసుకోవడంతో గమనించిన స్థానికులు అతన్ని పట్టుకుని ఠాణాకు తరలించారు. ఈ విషయమై టూటౌన్ పోలీసులను వివరణ కోరగా ఫిర్యాదు రాలేదని తెలిపారు.