
పరిశీలనలో బీసీ సబ్‌ప్లాన్: జోగురామన్న
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల తరహాలోనే బీసీలకు కూడా సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు దాస్యం వినయ్ భాస్కర్, పుట్టా మధు, శ్రీనివాస్‌గౌడ్ బీసీల సంక్షేమంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. రజక, నాయీబ్రాహ్మణ కులాల కోసం ఆధునికమైన లాండ్రీలు, సెలూన్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య బీసీ కమిషన్ అధికారాలను విస్తృతపర్చాలని కోరారు. సంక్షేమ పథకాల అమలు, బీసీలకు సామాజిక భద్రతపై కమిషనర్‌కు బాధ్యతలు, అధికారాలు, విధులు ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు.