బోగస్‌ ధ్రువీకరణ పత్రాలపై జేసీ విచారణ | jc inquiry on bogus certificates | Sakshi
Sakshi News home page

బోగస్‌ ధ్రువీకరణ పత్రాలపై జేసీ విచారణ

Published Sat, Oct 22 2016 1:10 AM | Last Updated on Wed, Apr 3 2019 5:51 PM

jc inquiry on bogus certificates

కర్నూలు(అగ్రికల్చర్‌): బోగస్‌ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాలు చేస్తున్నారనే ఆరోపణపై జేసీ హరికిరణ్‌ శుక్రవారం విచారణ నిర్వహించారు. జేసీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ సమావేశం జరిగింది. రైల్వేలో ఎస్టీ సర్టిఫికెట్‌పై ఉద్యోగం చేస్తున్న తిమ్మప్ప ఇప్పటికే రెండు, మూడు సార్లు విచారణకు రాకపోవడంతో.. ఈ విచారణకు విధిగా హజరు కావాలని ఆదేశించినా గైర్హాజరయ్యారు. కాగా ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌లో బైండర్‌గా పనిచేస్తున్న రాముడు యాదవ్‌ అయితే సుగాలి సర్టిఫికెట్‌తో ఉద్యోగం చేస్తున్నట్లు ఫిర్యాదు ఉంది. దీనిపై రాముడు కులాన్ని నిరూపించుకునేందుకు భార్య తరపు వారిని విచారణకు తీసుకొచ్చారు. అయితే దీనిపై జేసీ సంతృప్తి చెందలేదు. వీటిపై తగిన నిర్ణయం తీసుకునేందుకు జిల్లా కలెక్టర్‌కు నివేదించనున్నారు. విచారణలో డీఎల్‌ఎస్‌సీ కమిటీ సభ్యులు, సి సెక్షన్‌ సూపరింటెండెంట్‌ రామాంజనమ్మ, జిల్లా గిరిజన ఉద్యోగుల సంఘం నేతలు బద్దూనాయక్, మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement