రేపు కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గురువారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అవుతోంది. సీఎం కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సచివాలయంలో మధ్యా హ్నం 2 గంటలకు ఈ భేటీ జరుగుతుంది. ప్రధానంగా ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్ల శాతా న్ని పెంచే అంశంపై ఈ సమావేశంలో చర్చించ నున్నారు. మైనారిటీల సామాజిక ఆర్థిక స్థితి గతులపై అధ్యయనం చేసిన సుధీర్ కమిషన్, ఎస్టీల జీవన స్థితిగతులపై అధ్యయనం చేసిన జస్టిస్ చెల్లప్ప కమిషన్ ఇప్పటికేæ తమ నివేదిక లను ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలి సిందే. రిజర్వేషన్ల పెంపునకు కట్టుబడి ఉన్నట్లు ఇటీవల అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల పెంపు, అవసరమైన చట్టసవరణ కోరుతూ కేంద్రానికి పంపే ప్రతి పాదనలపై చర్చిస్తారు. మరో 15 అంశాలతో ఎజెండాను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
బడ్జెట్ తయారీపై పరిశీలన..
2017–18 బడ్జెట్ తయారీతో పాటు బడ్జెట్ సమావేశాలను ఎప్పుడు నిర్వహించాలి, బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. బడ్జెట్ రూప కల్పనలో నూతన నిబంధనలకు అనుగుణం గా ఈసారి ప్రణాళికా, ప్రణాళికేతర వ్యయాన్ని విలీనం చేయనున్న విషయం తెలిసిందే. అంతే గాకుండా కేంద్రం ఈసారి నెల రోజుల ముం దుగా బుధవారమే పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లు, పన్నుల వాటా, కేంద్ర ప్రాయో జిత పథకాల నిధులపై స్పష్టత వస్తుంది. దీని ఆధారంగా రాష్ట్ర బడ్జెట్‌ను పక్కాగా రూపొం దించుకునే వీలు కలుగనుంది. ఫిబ్రవరి మూడో వారంలో లేదా మార్చి మొదటి వారం లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభించా లని ప్రభుత్వం యోచిస్తోంది. గురువారం జరుగనున్న భేటీలో బడ్జెట్ సమావేశాల తేదీల ను ఖరారుతో పాటు కొత్తగా ప్రవేశపెట్టే ఆకర్షణీయ పథకాలు, వాటి ప్రయోజనాలపై చర్చించే అవకాశముంది. ఇప్పటికే వివిధ శాఖలు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలను ఈ సందర్భంగా సీఎం సమీక్షించనున్నారు.
భవనాల అప్పగింతపై చర్చ!
హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భవనాలపై గవర్నర్ సమక్షంలో బుధవా రం ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు సమావేశంకానున్నారు. సచివాల యంతో పాటు అసెంబ్లీ, కౌన్సిల్, వివిధ కార్యాలయాలు తమకు అప్పగించాలని తెలం గాణ మంత్రివర్గం ఇప్పటికే తీర్మానం చేసి గవర్నర్‌కు లేఖ రాసింది. అందులో తీసుకునే నిర్ణయాలు, తీర్మానాలు సైతం గురువారం జరిగే కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది. వీటితోపాటు గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలనుకున్న ప్రైవేటు వర్సిటీల బిల్లు, మూసీ రివర్ అథారిటీ, కొత్త నియామకాలు, హోంగార్డుల జీతాల పెంపు, పురపాలక, హోంశాఖలకు సంబంధించిన పలు చట్ట సవరణలు తదితర అంశాలు చర్చకు రానున్నాయి.
సబ్‌ప్లాన్ నిధుల బదిలీకి చట్ట సవరణ
ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్ నిధులు, సబ్‌ప్లాన్ చట్ట సవరణపై ఇటీవల అఖిలపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమీక్షిం చిన సీఎం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశా రు. బడ్జెట్‌లో సబ్‌ప్లాన్‌కు కేటాయించే నిధులు ఖర్చు కాకపోతే వచ్చే ఏడాదికి బదిలీ అయ్యే పద్ధతి అమలు చేయాలని, సబ్‌ప్లాన్ పేరు మార్చాలనే ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ‘క్యారీఫార్వర్డ్ (తర్వాతి ఏడాదికి బదిలీ)’ చేయాలా, వద్దా.. దీనికి చట్టసవరణ చేయాల్సి ఉంటుందా.. అనే అంశాలపై కేబినెట్ భేటీలో చర్చ జరుగనుంది. కమిటీలు ఇచ్చే సిఫారసులు ఈ సందర్భంగా కీలకం కానున్నాయి.