minority reservation
-
‘మార్కెట్’ పగ్గాలు సగానికి సగం మహిళలకే
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సగానికి సగం మార్కెట్ కమిటీల చైర్పర్సన్లుగా మహిళలు బాధ్యతలు స్వీకరించనున్నారు. కమిటీల్లో కూడా సగం మంది మహిళలే సభ్యులుగా ఉంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించిన ఈ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుని, వీరంతా రైతులకు ఉపయోగపడేలా కమిటీల పాలనా వ్యవహారాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తొలి సారిగా 50 శాతం నామినేటెడ్ పదవులను మహిళలకు రిజర్వ్ చేస్తానన్న వైఎస్ జగన్ హామీ కార్యరూపం దాలుస్తుండడంతో వీరికి ఈ అవకాశం లభిస్తోంది. దీంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్లకు అనుగుణంగా ఆయా వర్గాల వారు 50 శాతం మందిని ఎంపిక చేసేలా కసరత్తు సాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 220 మార్కెట్ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు వీటిలో సగం.. అంటే 110 కమిటీలకు చైర్పర్సన్లుగా మహిళలు రానున్నారు. జిల్లాను యూనిట్‌గా చేసుకుని కమిటీల రిజర్వేషన్ల ప్రక్రియ కసరత్తు జరుగుతోంది. అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తి కాగానే ప్రభుత్వం మార్కెట్ కమిటీల నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేయనుంది. నియోజకవర్గానికి ఒకటి తప్పనిసరి.. శాసనసభ్యుల కోరిక మేరకు రాష్ట్రంలోని మార్కెట్ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మార్కెట్ కమిటీ తప్పనిసరిగా ఉండేలా ప్రతిపాదనలు తయారు చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 191 మార్కెట్ కమిటీలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో మార్కెట్ కమిటీలు లేని నియోజకవర్గాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 220 మార్కెట్ కమిటీలు రైతులకు సేవలందిస్తాయి. ఎమ్మెల్యేను మార్కెట్ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా ప్రభుత్వం ప్రకటించింది. ఎమ్మెల్యేతో సహా 20 మంది సభ్యులు ఉంటారు. వీరిలో నలుగురు అధికారులు, 12 మంది రైతులు, ముగ్గురు వ్యాపారులు. ఎమ్మెల్యే, వ్యాపారులు, అధికారులు కాకుండా మిగతా సభ్యులందరూ తప్పనిసరిగా రైతు అయి ఉండాలి. భూమి లేకున్నా, పాడి పశువులున్న వారిని సభ్యులుగా పరిగణిస్తారు. సభ్యులుగా (అధికారులు మినహా) సైతం సగం మంది మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు. గ్రామాల్లో సందడి ప్రభుత్వం రాష్ట్రంలోని మార్కెట్ కమిటీలకు చైర్పర్సన్లను, సభ్యులను నియమించనుందనే సమాచారం రావడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. కమిటీల చైర్పర్సన్లు, సభ్యుల ఎంపికపై ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయం, పంటల ధరవరలు, క్రయ విక్రయాలపై అవగాహన కలిగిన వారి పేర్లు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేయనున్న ఉత్తర్వుల ప్రకారం ఏడాది కాలానికి కమిటీ ఏర్పాటవుతుంది. పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. -
రిజర్వేషన్లు అమలు చేయాలి
నల్లగొండ టౌన్ : జనాభా ప్రకారం మాదిగలు, ము స్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు చే యాలని మాదిగ,ముస్లిం జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక అంబేద్కర్ భవన్లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన లేని కారణంగా చాలా వెనుకబాటులకు గురవుతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. ముస్లింలకు 12 శా తం రిజర్వేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాదిగ, ముస్లింలకు అన్ని ప్రాంతాల్లో నామినేటెడ్ పదువులు కల్పించాలన్నారు. మాదిగలు, ముస్లిలు రిజర్వేషన్లను సాధించుకోవడానికి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మాదిగ యూత్ జేఏసీరాష్ట్ర అధ్యక్షుడు పెరిక కరంజయ్‌రాజ్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సయ్యద్ ఎహసానొద్దీన్, అనీష్, ఖలీం బాయ్, హఫీజ్‌ఖాన్, సలీం,మైళాన అ బ్బర్, హాషం, ఎంఎ నాజీర్, కత్తుల నర్సింహ్మ, పెరిక ఉమామహేశ్వర్, దున్నయాదగిరి, కొంపెల్లి భిక్షపతి, పెరి కరాజు, తలారి పరమేష్, మేడి రాజు, బొజ్జ నర్సింహ్మ, మహ్మద్‌షరీఫ్, షమీ, ఆసిస్, రిజ్వాన్, కొండల్, మేడి నర్సిం హ్మ, హరికృష్ణ, చింత జయసేన, కత్తుల తులసీదాస్, అంబేద్కర్ పాల్గొన్నారు. -
రేపు కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గురువారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అవుతోంది. సీఎం కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సచివాలయంలో మధ్యా హ్నం 2 గంటలకు ఈ భేటీ జరుగుతుంది. ప్రధానంగా ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్ల శాతా న్ని పెంచే అంశంపై ఈ సమావేశంలో చర్చించ నున్నారు. మైనారిటీల సామాజిక ఆర్థిక స్థితి గతులపై అధ్యయనం చేసిన సుధీర్ కమిషన్, ఎస్టీల జీవన స్థితిగతులపై అధ్యయనం చేసిన జస్టిస్ చెల్లప్ప కమిషన్ ఇప్పటికేæ తమ నివేదిక లను ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలి సిందే. రిజర్వేషన్ల పెంపునకు కట్టుబడి ఉన్నట్లు ఇటీవల అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల పెంపు, అవసరమైన చట్టసవరణ కోరుతూ కేంద్రానికి పంపే ప్రతి పాదనలపై చర్చిస్తారు. మరో 15 అంశాలతో ఎజెండాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. బడ్జెట్ తయారీపై పరిశీలన.. 2017–18 బడ్జెట్ తయారీతో పాటు బడ్జెట్ సమావేశాలను ఎప్పుడు నిర్వహించాలి, బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. బడ్జెట్ రూప కల్పనలో నూతన నిబంధనలకు అనుగుణం గా ఈసారి ప్రణాళికా, ప్రణాళికేతర వ్యయాన్ని విలీనం చేయనున్న విషయం తెలిసిందే. అంతే గాకుండా కేంద్రం ఈసారి నెల రోజుల ముం దుగా బుధవారమే పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లు, పన్నుల వాటా, కేంద్ర ప్రాయో జిత పథకాల నిధులపై స్పష్టత వస్తుంది. దీని ఆధారంగా రాష్ట్ర బడ్జెట్‌ను పక్కాగా రూపొం దించుకునే వీలు కలుగనుంది. ఫిబ్రవరి మూడో వారంలో లేదా మార్చి మొదటి వారం లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభించా లని ప్రభుత్వం యోచిస్తోంది. గురువారం జరుగనున్న భేటీలో బడ్జెట్ సమావేశాల తేదీల ను ఖరారుతో పాటు కొత్తగా ప్రవేశపెట్టే ఆకర్షణీయ పథకాలు, వాటి ప్రయోజనాలపై చర్చించే అవకాశముంది. ఇప్పటికే వివిధ శాఖలు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలను ఈ సందర్భంగా సీఎం సమీక్షించనున్నారు. భవనాల అప్పగింతపై చర్చ! హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భవనాలపై గవర్నర్ సమక్షంలో బుధవా రం ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు సమావేశంకానున్నారు. సచివాల యంతో పాటు అసెంబ్లీ, కౌన్సిల్, వివిధ కార్యాలయాలు తమకు అప్పగించాలని తెలం గాణ మంత్రివర్గం ఇప్పటికే తీర్మానం చేసి గవర్నర్‌కు లేఖ రాసింది. అందులో తీసుకునే నిర్ణయాలు, తీర్మానాలు సైతం గురువారం జరిగే కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది. వీటితోపాటు గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలనుకున్న ప్రైవేటు వర్సిటీల బిల్లు, మూసీ రివర్ అథారిటీ, కొత్త నియామకాలు, హోంగార్డుల జీతాల పెంపు, పురపాలక, హోంశాఖలకు సంబంధించిన పలు చట్ట సవరణలు తదితర అంశాలు చర్చకు రానున్నాయి. సబ్‌ప్లాన్ నిధుల బదిలీకి చట్ట సవరణ ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్ నిధులు, సబ్‌ప్లాన్ చట్ట సవరణపై ఇటీవల అఖిలపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమీక్షిం చిన సీఎం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశా రు. బడ్జెట్లో సబ్‌ప్లాన్‌కు కేటాయించే నిధులు ఖర్చు కాకపోతే వచ్చే ఏడాదికి బదిలీ అయ్యే పద్ధతి అమలు చేయాలని, సబ్‌ప్లాన్ పేరు మార్చాలనే ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ‘క్యారీఫార్వర్డ్ (తర్వాతి ఏడాదికి బదిలీ)’ చేయాలా, వద్దా.. దీనికి చట్టసవరణ చేయాల్సి ఉంటుందా.. అనే అంశాలపై కేబినెట్ భేటీలో చర్చ జరుగనుంది. కమిటీలు ఇచ్చే సిఫారసులు ఈ సందర్భంగా కీలకం కానున్నాయి.