నల్లగొండ టౌన్ : జనాభా ప్రకారం మాదిగలు, ము స్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు చే యాలని మాదిగ,ముస్లిం జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన లేని కారణంగా చాలా వెనుకబాటులకు గురవుతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. ముస్లింలకు 12 శా తం రిజర్వేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాదిగ, ముస్లింలకు అన్ని ప్రాంతాల్లో నామినేటెడ్ పదువులు కల్పించాలన్నారు.
మాదిగలు, ముస్లిలు రిజర్వేషన్లను సాధించుకోవడానికి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మాదిగ యూత్ జేఏసీరాష్ట్ర అధ్యక్షుడు పెరిక కరంజయ్‌రాజ్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సయ్యద్ ఎహసానొద్దీన్, అనీష్, ఖలీం బాయ్, హఫీజ్‌ఖాన్, సలీం,మైళాన అ బ్బర్, హాషం, ఎంఎ నాజీర్, కత్తుల నర్సింహ్మ, పెరిక ఉమామహేశ్వర్, దున్నయాదగిరి, కొంపెల్లి భిక్షపతి, పెరి కరాజు, తలారి పరమేష్, మేడి రాజు, బొజ్జ నర్సింహ్మ, మహ్మద్‌షరీఫ్, షమీ, ఆసిస్, రిజ్వాన్, కొండల్, మేడి నర్సిం హ్మ, హరికృష్ణ, చింత జయసేన, కత్తుల తులసీదాస్, అంబేద్కర్ పాల్గొన్నారు.
రిజర్వేషన్లు అమలు చేయాలి
Published Tue, Mar 21 2017 2:01 AM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM
Advertisement
Advertisement