
కొనసాగుతున్న వీఆర్‌పీఎస్ దీక్షలు
కర్నూలు(అర్బన్): వాల్మీకులను ఎస్‌టీ జాబితాలో చేరుస్తూ ఆరు నెలల్లోగా చట్టబద్దత కల్పించాలనే డిమాండ్‌పై ఈ నెల 16వ తేదీ నుంచి స్థానిక శ్రీ కృష్ణదేవరాయల సర్కిల్‌లో వీఆర్‌పీఎస్ చేపట్టిన నిరవధిక సత్యాగ్రహ దీక్షలు శనివారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వీఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ప్రాణాలు పోయినా ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు. జిల్లాలోని వాల్మీకులందరూ వీఆర్‌పీఎస్ చేస్తున్న ఉద్యమానికి మద్దతు పలకాలన్నారు. ఈ నెల 18వ తేదీన దీక్షల ముగింపు సందర్భంగా జెడ్పీ నుంచి భారీ ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. దీక్షల్లో ప్యాపిలి ఎంపీపీ సరస్వతమ్మ, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, వీఆర్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడురు గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు. కర్నూలు బార్ అసోసియేషన్ నాయకులు వాసు, దేవపాల్, శ్రీవాస్తవ తదితరులు..దీక్షలకు మద్దతు ప్రకటించారు.