ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ జి.వీరపాండియన్ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రోశన్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో గ్రీవెన్స్ ప్రారంభమవుతుందన్నారు.
అనంతపురం అర్బన్ (అనంతపురం): ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ జి.వీరపాండియన్ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రోశన్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో గ్రీవెన్స్ ప్రారంభమవుతుందన్నారు. దళిత, గిరిజన సంఘాల నాయకులు, ప్రజలు తమ ఫిర్యాదులను, సమస్యలను అర్జీ రూపంలో సమర్పించుకోవాలని ఆయన వెల్లడించారు.