ఇంతకీ రుణమాఫీ జరిగేనా ?
రుణమాఫీలో ఏపాటి చిన్న సమస్యవున్నా ప్రత్యేక గ్రీవెన్స్‌లో మరోమారు అన్ని పత్రాలు ఇవ్వాల్సిందే. ఏదేని ఒక్క పత్రం లేకున్నా అన్నీ తెచ్చి ఇచ్చేవరకు దరఖాస్తులను అధికారులు స్వీకరించడంలేదు. రుణమాఫీలో తలెత్తిన సమస్యలను విన్నవించేందుకు జిల్లా వ్యాప్తంగా రైతులు జిల్లా కేంద్రానికి నిత్యం క్యూ కడుతున్నారు. ఇప్పటికి దాదాపు 4500 దరఖాస్తులను అధికారులు ప్రత్యేక ప్రజావాణి ద్వారా స్వీకరించారు. ఈ ప్రత్యేక గ్రీవెన్స్ ఈ నెల 15వ తేదీ వరకు మాత్రమే పనిచేస్తుంది.
- మళ్లీ అన్ని పత్రాలు ఇవ్వాల్సిందే
- ఏ ఒకటి లేకున్నా దరఖాస్తులు స్వీకరించరు
- దరఖాస్తులకు గడువు ఈ నెల 15 వరకే
- అర్జీలు ఆన్లైన్ చేయరు..హైదరాబాద్‌కు పంపుతారు
చిత్తూరు (అగ్రికల్చర్) : జిల్లాలో మొత్తం 8,70,321 మం ది రైతులు 2013 డిసెంబర్ 31 నాటికి రూ. 11,180.25 కోట్ల మేరకు వ్యవసాయ రుణాల రూపంలో బ్యాంకర్లకు బకాయిపడ్డారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు 5.63 లక్షల మం దిని మాత్రం రుణమాఫీకి అర్హులని బ్యాంకర్లు ప్రభుత్వానికి నివేదిక పం పారు. ప్రభుత్వం అందులో తొలి, మ లి విడత జాబితాల్లో మొత్తం 4,53,773 మంది రైతులకే మాఫీ పర్తింపజేసింది. మిగిలిన 4,16.548 మంది రైతులకు మొండిచేయి చూపింది. రూ. 11,180. 25 కోట్లకుగాను దాదాపు రూ. 600 కోట్ల మేర మాత్రమే మాఫీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు కూడా రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ మొత్తాలు అందక తీవ్రస్థాయిలో సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రభుత్వం జిల్లా వ్యవసాయశాఖ కార్యాల యంలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి సమస్యలు ఉన్న రైతులు తమ ఫిర్యాదులను విన్నవించుకోవాలని తెలి పింది.
అన్నీ ఉంటేనే స్వీకరణ
రుణమాఫీలో తలెత్తిన సమస్యలను విన్నవించుకునేందుకు విచ్చేసే రైతులు మరోమారు అన్ని పత్రాలను ఇస్తేనే అధికారులు దరాఖాస్తులను స్వీకరిస్తున్నారు. రుణమాఫీలో ఏపాటి చిన్న సమస్య ఉన్నా రైతులు తమ ఫిర్యాదు పత్రంతోపాటు ఏయే బ్యాంకులో ఎంత భూమికి, ఎంత రుణాన్ని పొందారనే విషయాలకు సంబంధించిన వివరాల తోపాటు, ఆన్లైన్లో తీసుకున్న రుణమాఫీ పత్రం, ఆ భూములకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాల న కలు, రేషన్‌కార్డు, ఓటరు గుర్తింపుకా ర్డు, బ్యాంకు పాస్‌బుక్, కుటుంబంలో ని అందరి ఆధార్ కార్డుల నకలు జతచేయాలి. అధికారులు వాటిని పూర్తిగా పరిశీలించి ఏదేని ఒకపత్రంలో అక్షరం తప్పు ఉన్నట్లు గుర్తించినా దరఖాస్తులను స్వీకరించక తిప్పి పంపేస్తున్నారు.
అర్జీలన్నీ హైదరాబాదుకే
ప్రభుత్వపాలనా వ్యవహారాలన్నీ ఈ -ఆఫీస్, ఆన్లైన్ పద్ధతిలోనే చక్కబెడుతున్నారు. కానీ రుణమాఫీ సమస్యలపై వచ్చే దరఖాస్తులను మాత్రం ఆన్లైన్ చేయకుండా రిజిస్టర్ పోస్టు ద్వారా ైెహ దరాబాద్‌లోని రుణమాఫీ కమిటీ ప్రతి నిధి కుటుంబరావుకు పంపుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. రుణమాఫీ సమస్యల దరఖాస్తులను గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోందేతప్ప ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పడంలేదు.