
సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండలో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ ప్రారంభం
రాష్ట్రంలోనే తొలిసారిగా..
రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి నల్లగొండ జిల్లాలో వృద్ధులు, దివ్యాంగుల కోసం కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక గ్రీవెన్స్‌ను గురువారం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా పలువురు వృద్ధులు, వికలాంగులు కలెక్టరేట్‌కు తరలివచ్చి కలెక్టర్‌కు తమ బాధలను వివరించి ఆదుకోవాలని వేడుకున్నారు. వారందరికీ కలెక్టర్ భరోసా ఇచ్చారు.
ప్రత్యేక గ్రీవెన్స్‌కు వచ్చే వారి సమస్యలు ఎట్టిపరిస్థితుల్లో పరిష్కారం కావాలని అధికారులను ఆదేశించారు. ఇకపై ప్రతి గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. ‘ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి 80 ఏళ్లు దాటిన వృద్ధులు, నడవలేని స్థితిలో ఉండే దివ్యాంగులు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. వారు అలా గంటల తరబడి వేచిఉండటం బాధగా అనిపించింది. అందుకే వారి సమస్యలపై ప్రత్యేకంగా ప్రతి గురువారం గ్రీవెన్స్ నిర్వహించాలని నిర్ణయించాను’ అని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. – సాక్షి ప్రతినిధి, నల్లగొండ
ఈయన పేరు దేవరకొండ అంజయ్య, చిట్యాల మండలం ఏపూర్ గ్రామం. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ఒక్కో బిడ్డకు ఒక ఎకరం చొప్పున రాసిచ్చారు. తన జీవనం కోసం ఒక ఎకరం తన పేరునే ఉంచుకున్నారు. అయితే ఒక మనవడు మభ్యపెట్టి అంజయ్య పేరున ఉన్న ఎకరం భూమిని కూడా రాయించుకున్నాడు. దీంతో ఆయనకు ఆధారం లేకుండా పోయింది. అధికారులను ఆశ్రయించినా న్యాయం జరగకపోవడంతో ప్రత్యేక గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు తన గోడు చెప్పుకున్నారు. దీంతో మనవడు చేయించుకున్న భూమి పట్టాను రద్దుచేసి, తిరిగి అంజయ్య పేరున పట్టా జారీచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment