తేనెపల్లిలో వివరాలు సేకరిస్తున్న పోలీసులు, హత్యకు గురైన వృద్ధుడు
గుర్రంపోడు(నాగార్జునసాగర్) : నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనెపల్లి గ్రామంలో ఆది వారం సాయంత్రం ఓ వృద్ధుడు దారుణహత్యకు గురయ్యాడు. గ్రామస్తులు చూస్తుండగానే ఓ యు వకుడు వృద్ధుడి గొంతుకోసి హత్య చేశాడు. స్థాని కులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రా మానికి చెందిన శివార్ల లింగయ్య(65) అనే వృ ద్ధుడు గ్రామ సెంటర్‌లో నడుచుకుంటూ వస్తున్నా డు. ఇంతలో వెనుక నుంచి వచ్చిన కొట్ర అనిల్ అనే యువకుడు కత్తితో వెనుక నుంచి పొడిచి కింద పడిపోగానే కత్తితో గొంతుకోసి కత్తిని అక్కడే పడవేసి పారిపోయాడు. గమనించిన పక్కనే ఉన్న కొందరు దగ్గరకు చేరుకునేలోపే దారుణం జరి గింది. తీవ్ర రక్తస్రావంతో వృద్ధుడు అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు.
అనుమానంతో..
కోట్ర అనిల్ రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. లింగయ్య చేతబడి చేస్తున్నాడనే అనుమానం అనిల్ కుటుంబ సభ్యుల్లో నెలకొంది. గతంలో ఇదే విషయమై లింగయ్యపై దాడి చేయగా గ్రామంలో పంచాయితీ కూడా జరిగింది. పెద్ద మనుషులు సర్దిచెప్పడంతో వివాదం అంతటిలో ముగిసింది. ఇటీవల అనిల్ ఆరోగ్యం క్షీణించడంతో ఇంటర్ పూర్తి చేసి ఇంటివద్దనే ఉంటున్నాడు. తన అనారోగ్యానికి లింగయ్య చేతబడే కారణమనే అనుమానంతో యువకుడు కక్ష పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. హతుడు లింగయ్యకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సంఘటనా స్థలాన్ని మల్లేపల్లి సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌ఐ క్రాంతికుమార్‌లు పరిశీలించారు. నింది తుడు పరారీలో ఉన్నాడు.
మండలంలో నాలుగో ఘటన !
గుర్రంపోడు మండలంలో ఈ ఏడాది ఫిబ్రవరి 27 మండలంలోని తెరాటిగూడెం గ్రామంలో చేతబడి నెపంతో గ్రామం నడిబొడ్డున ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గతంలో తేనెపల్లిలోనే గ్రామంలో వృద్ధురాలు, తానేదార్‌పల్లి గ్రామంలో వృద్ధుడు హత్యకు గురయ్యారు. తాజాగా లిం గయ్య.. ఈ హత్యలన్నీ మంత్రాల నెపంతోనే జరిగినవే. బాగా అభివృద్ధి చెందిన గ్రామాల్లోనూ మంత్రాలు అనే మూఢనమ్మకాలతో దారుణాలు జరుగుతుండడం గమనార్హం. పోలీసులు కళా జాతా ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలతో అవగాహక కల్పిస్తునే ఉన్నా గ్రామాల్లో మూఢనమ్మకాల జాడ్యం వీడడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment