గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఎస్టీ అభ్యర్థులకు అందించనున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలి పారు.
గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణ
Aug 25 2016 12:27 AM | Updated on Sep 4 2017 10:43 AM
ఏటూరునాగారం : గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఎస్టీ అభ్యర్థులకు అందించనున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలి పారు. ఎస్టీ అభ్యర్థులకు ఐఏఎస్(ప్రిలిమ్స్), సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (మెయిన్స్), పోలీస్ కానిస్టేబుల్(మెయిన్స్) పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. గ్రామీణులైతే వార్షిక ఆదాయం రూ. 1.5 లక్షలు, పట్టణ ప్రాంతంలో వార్షిక ఆదాయం రూ.2 లక్షలు దాటని వారు ఉచిత శిక్షణకు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాల కు 94910 34198 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
Advertisement
Advertisement