సొంత గుర్తింపును కోల్పోతామని
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీశాఖల వ్యతిరేకత
సాక్షి, హైదరాబాద్: అన్ని సంక్షేమశాఖలకు సంబంధించి సమీకృత అధ్యయన కేంద్రాలను (ఇంటిగ్రేటెడ్ స్టడీ సెంటర్లు) ఏర్పాటుచేయాలనే రాష్ర్ట ప్రభుత్వ ఆలోచనకు ప్రతిపాదన దశలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులందరికీ ఒకే చోట శిక్షణనివ్వాలనే కొత్త ఆలోచనపై ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖల నుంచి సానుకూల స్పందన వ్యక్తం కావడం లేదు.
ఈ నెల 8న ‘మీటింగ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆన్ స్ట్రీమ్‌లైనింగ్ వెల్పేర్ డిపార్ట్‌మెంట్’ పేరిట నిర్వహించిన మంత్రుల బృందం భేటీలో అన్ని వర్గాల విద్యార్థులకు కలిపి ఒకే స్టడీ సెంటర్ ఏర్పాటు చేయాలనే సూచన వచ్చింది. ముందుగా హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 400 మంది విద్యార్థులకు ప్రయోగాత్మకంగా స్టడీ సెంటర్‌ను మొదలుపెట్టి, ఆ తర్వాత వాటిని అన్ని జిల్లాలకు విస్తరించాలని నిర్ణయించారు.
అయితే ఇప్పటికే తమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న స్టడీసెంటర్లకు మంచి గుర్తింపు ఉన్నందున, తమ ప్రత్యేక ముద్ర పోతుందని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖలు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. అదీగాకుండా తమకు వస్తున్న కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నిధులపై ఆధిపత్యం పోతుందనే భావనతో ఈ అధికారులున్నట్లు చెబుతున్నారు.
ఇంటిగ్రేటెడ్ స్టడీ సెంటర్ల ఏర్పాటుకు విముఖత
Published Sun, May 17 2015 2:28 AM | Last Updated on Fri, Jul 26 2019 4:10 PM
Advertisement
Advertisement