ఎస్సీ, ఎస్టీలకు మెడికల్ సీట్లు వద్దా?
ఎమ్మెల్యే సంపత్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మెడికల్ సీట్ల ఫీజులను పెంచడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ విమర్శించారు. బీ-కేటగిరీ సీట్లను ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలకు అప్పగించడం వల్ల వాటికి విపరీతంగా ఫీజులు పెరిగాయన్నారు. ఒక్కొక్క సీటుకు రూ.1.3 కోట్లు అడుగుతున్నారని ఆయన ఆరోపించారు.
రిజర్వేషన్ల ప్రకారం మెడికల్ సీట్లను ఇవ్వాలని సంపత్ సోమవారం డిమాండ్ చేశారు. ఈ విషయంలో కోర్టుకు వెళ్తామన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన చేపడతామని చెప్పారు.