MLA Sampath Kumar
-
తుమ్మిళ్ల లిఫ్టు వద్ద ఉద్రిక్తత
రాజోళి/ శాంతిగనర్: జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేసే క్రమంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్కి చెందిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఏఐసీసీ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మధ్య వివాదం ఏర్పడి పోటాపోటీగా ఆందోళనకు దిగారు. జిల్లాలోని ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరందించేందుకు తుంగభద్ర నదిపై నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా ప్రస్తుతం నీరు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఉదయం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తుమ్మిళ్లకు వెళ్లి మోటార్లు ఆన్ చేసి, పూజలు చేసేందుకు డీ–23 కెనాల్ వద్దకు వెళ్లారు. అనంతరం ఏఐసీసీ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ తుమ్మిళ్ల వద్దకు వచ్చారు.అయితే తాను మోటార్ ఆన్ చేసినప్పటికీ కెనాల్లో నీరు విడుదల కాలేదని, దీనికి సంపత్‌కుమారే కారణమని ఎమ్మెల్యే విజయుడు ఆరోపించి, ఆందోళన చేస్తూ బైఠాయించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఎమ్మెల్యేగా తాను ప్రోటోకాల్ ప్రకారమే నీటిని విడుదల చేసేందుకు వచ్చానని, తాను ఆన్ చేసిన తర్వాత మళ్లీ ఆయన ఏ హోదాలో ఆఫ్ చేస్తారని, వెంటనే సంపత్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నీటిని విడుదల చేసేదాకా అక్కడి నుంచి వెళ్లనని తేలి్చచెప్పారు. పోలీసులు ఎంతసర్ది చెప్పినా వినలేదు.మరోవైపు తుమ్మిళ్ల నుంచి డీ–23కి కాంగ్రెస్ కార్యకర్తలతో బయలుదేరిన సంపత్ కుమార్‌ను పోలీసులు పచ్చర్లలోనే నిలిపేశారు. దీంతో ఆయన పోలీసులపై మండిపడ్డారు. కాగా.. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన పోలీసులు ఎమ్మెల్యే విజయుడిని అరెస్టు చేశారు. కాగా.. తనపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వాటిలో వాస్తవం లేదని నిరూపించుకునేందుకు నీటి విడుదల తన ఆధ్వర్యంలోనే చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆర్డీఎస్ కెనాల్ వద్ద సంపత్‌కుమార్ నిరసనకు దిగారు. చివరికి నాటకీయ పరిణామాల మధ్య ఉదయం విడుదల కావాల్సిన నీరు సాయంత్రం 4.15 గంటలకు అధికారులే విడుదల చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
రయ్.. రయ్.. రాహుల్
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో తెలంగాణకు వచ్చిన రాహుల్‌గాంధీ తొలిరోజు బిజీబిజీగా గడిపారు. ఉదయం 11:30కి శంషాబాద్‌కు వచ్చిన ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో కర్ణాటకలోని బీదర్‌కు వెళ్లి అక్కడ జరిగిన ఓ సమావేశంలో పాల్గొని మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ శంషాబాద్‌కు వచ్చారు. అక్కడ్నుంచి క్లాసిక్ కన్వెన్షన్‌లో జరిగిన మహిళా సంఘాల ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత 6 గంటల ప్రాంతంలో శేరిలింగంపల్లికి చేరుకుని బహిరంగ సభలో మాట్లాడారు. అనంతరం 7:30 సమయంలో శేరిలింగంపల్లి నుంచి ప్రత్యేక బస్సులో బయల్దేరి రాత్రి బస చేసే హరిత ప్లాజాకు వెళ్లారు. అక్కడ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, ఏఐసీసీ నేత కొప్పుల రాజు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో భేటీ అయి తొలిరోజు పర్యటనను సమీక్షించారు. తొలి రోజు జరిగిన రెండు సభలకూ మంచి స్పందన కనిపించడం, పెద్దఎత్తున కాంగ్రెస్ శ్రేణులు కనిపించడంతో టీపీసీసీ నాయకత్వం ఊపిరి పీల్చుకుంది. సంపత్.. ఇటు రా.. మహిళా సంఘాలతో సమావేశం సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ హల్చల్ చేశారు. రాహుల్ వేదికపైకి వచ్చినప్పట్నుంచీ సభ నిర్వహణ వ్యవహారాల్లో ఆయన చురుగ్గా వ్యవహరించారు. సంపత్‌ను ప్రత్యేకంగా పిలిచిన రాహుల్ ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. ‘సంపత్.. ఇటు రా’ అని పిలిచి ఆ సమయంలో ఉత్తమ్ తెలుగులో ఏం మాట్లాడుతున్నారంటూ ఆరా తీశారు. ఆ సమ యంలో మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, సీఎల్పీ నేత జానారెడ్డిలు కలుగజేసుకుని రాహుల్‌కు రాష్ట్రంలోని పరిస్థితిని వివరించే యత్నం చేశారు. నేటి షెడ్యూల్ ఇదీ.. రెండో రోజు రాహుల్ షెడ్యూల్లో కొంత మార్పు జరిగింది. మంగళవారం ఉదయం 9 గంటలకు పార్టీ కేడర్, నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించాల్సి ఉంది. కానీ ఆ సమయంలో రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాహుల్ భేటీ కానున్నారు. సోమ వారం ఆలస్యంగా ఈ నిర్ణయం తీసుకుని వెంటనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారమిచ్చారు. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు, రాష్ట్రంలో పార్టీ పనితీరు, ఇటీవలి రాజకీయ పరిణామాలపై ఈ భేటీలో చర్చిస్తారని సమాచారం. అనంతరం పార్టీ కేడర్‌తో టెలీకాన్ఫరెన్స్, ఎడిటర్లు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు, గన్‌పార్కు వద్ద తెలం గాణ అమరవీరులకు నివాళులు, సరూర్‌నగర్ స్టేడి యంలో ‘విద్యార్థి నిరుద్యోగ గర్జన’లో పాల్గొని సాయంత్రం 7:30కి రాహుల్ ఢిల్లీ వెళ్లనున్నారు. -
కోమటిరెడ్డి, సంపత్‌కు మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ : స్పీకర్‌పై దాడి చేశారనే కారణంతో అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో వీరిద్దరికీ ఎటువంటి సదుపాయాలు కల్పించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. శాసనసభ సభ్యత్వం కోల్పోయినందువల్ల ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాజీ అవుతారని కావున వారికి శాసనసభ్యులకు లభించే సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. వీరిద్దరికీ ఎమ్మెల్యే గదులు కేటాయించాల్సిన అవసరం లేదని ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) స్పష్టం చేసింది. కాగా, టీఆర్ఎస్ సర్కారు నిర్ణయంపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీఎస్పీఎస్సీలో అక్రమాలు: సంపత్
హైదరాబాద్: టీఎస్పీఎస్సీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నీళ్లు, నియామకాలు, నిధుల డిమాండ్లపై ఆవిర్భవించిన తెలంగాణలో యువతకు మొండిచెయ్యే మిగిలిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన యువతను ప్రభుత్వం విస్మరించడం దారుణమన్నారు. గ్రూప్–1 ఫలితాలను ఎందుకు నిలిపివేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రూప్–1 ఫలితాల నిలిపివేత, అవకతవకలపై వాయిదా తీర్మానం ఇస్తే.. ప్రభుత్వం తమకు కనీసం సమాచారం ఇవ్వలేదన్నారు. టీఎస్పీఎస్సీ పనితీరుపై అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సీఎం, మంత్రి అసహనం వ్యక్తం చేశారన్నారు. ఉద్యోగాలు వచ్చాయని ఆశపడ్డ 121 మంది భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘లక్ష మంది కేసీఆర్‌లు వచ్చినా ఏమీ చేయలేరు’
సాక్షి, హైదరాబాద్: లక్షమంది కేసీఆర్‌లు కలిసినా ఉత్తముడైనా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఏమీ చేయలేరని ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేర్కొన్నారు. గాంధీభవన్ ఆవరణలో శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అన్యాయం జరిగితే గొంతెత్తే పీసీసీ అధ్యక్షుడిపై అనాలోచితంగా మాట్లాడడం సీఎం మానుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియంత పోకడలకు పోతుందన్నారు. ప్రభుత్వపై విమర్శలు చేస్తే సహించలేకపోతుందని, వారిపై కక్ష సాధిస్తోందని ఆయన విమర్శించారు. అమరుల కోసం జేఏసీ చైర్మన్ కోదండరాం యాత్ర చేపడితే ఆయన్ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలను మానుకోవాలని ఎమ్మెల్యే హితవు పలికారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల కల్పనకు సంబంధించిన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పదోన్నతులు కల్పిస్తోందని ఆయన మండిపడ్డారు. ఒక్క దళిత ఉద్యోగికి అన్యాయం జరిగినా సహించేది లేదని ఎమ్మెల్యే సంపత్ కుమార్ హెచ్చరించారు. తెలంగాణ జిల్లాల్లో అమరవీరుల స్ఫూర్తి యాత్రకు బయలుదేరిన టీజేఏసీ ఛైర్మన్ కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
గన్మెన్లను తిప్పిపంపిన ఎమ్మెల్యే
హైదరాబాద్: తన రక్షణకు కేటాయోగించిన గన్ మెన్లను అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తిప్పి పంపారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. అంబేద్కర్ జయంతి సందర్బంగా తన గన్మెన్లను ఎమ్మెల్యే తిప్పి పంపారు. రాష్ట్రంలో ప్రజలకు లేని రక్షణ తనకెందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రక్షించాల్సిన పోలీసులే ప్రజలను భక్షిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు. -
'మీ తాత పుట్టకముందే కాంగ్రెస్ పుట్టింది'
-
'మీ తాత పుట్టకముందే కాంగ్రెస్ పుట్టింది'
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ తమ పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలు సమకాలీన రాజకీయాలకు మచ్చతెచ్చేలా ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విమర్శించారు. కేటీఆర్ తాత పుట్టకముందే కాంగ్రెస్ పార్టీ పుట్టిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తామని ఆయన మాదిరి అన్న నేతలంతా చరిత్రలో కలిసిపోయారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బిక్ష వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి, ఆయన కుటుంబానికి నాలుగు పదవులు వచ్చాయని.. కేటీఆర్ మర్చిపోవద్దని అన్నారు. స్థాయికి మించి మాట్లాడితే రానున్నరోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అధికార మదం వద్దని హితవు పలికారు. మెడలు వంచి తెలంగాణ తెచ్చినం అంటున్న కేటీఆర్‌కు...సోనియాగాంధీ కాళ్ల దగ్గర కేసీఆర్ మూడు తరాల వాళ్లు నిల్చున్నది గుర్తులేదా అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ తెలంగాణ వాదాన్ని, సెంటిమెంట్ ని అడ్డంపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టే జాతి కేసీఆర్ కుటుంబానిదని దుమ్మెత్తిపోశారు. -
వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు
హైదరాబాద్: నకిలీ మిర్చీ విత్తనాల బారిన పడిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. అలంపూర్ నియోజకవర్గ మిరప రైతులు నగరంలోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. రైతులకు న్యాయం చేసేంత వరకు ఇక్కడే కూర్చుంటామని రైతులు కార్యాలయం ఎదుట బైఠాయించారు. వారి నిరసనకు ఎమ్మెల్యే సంపత్ కుమార్ సంఘీభావం తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. -
వ్యర్థాల పునర్వినియోగంతో లాభాలు
⇒ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ⇒ వ్యర్థాల నియంత్రణపై మరిన్ని పరిశోధనలు జరగాలి ⇒ కాలుష్య రహిత సమాజంకోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలి సాక్షి, హైదరాబాద్: వ్యర్థాల పునర్వినియోగం ద్వారా సంపదను పెంపొందించుకునేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని అలంపూర్ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్‌కుమార్ అన్నారు. వ్యర్థాలను నియంత్రించి కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం జాతీయ ఉత్పాదకత వారోత్స వాలను పురస్కరించుకుని జాతీయ ఉత్పాద కత మండలి ఆధ్వర్యంలో ‘వ్యర్థాల పునర్వి నియోగం ద్వారా లాభాలు’ అంశంపై సదస్సు నిర్వహించారు. సెస్ ఆడిటోరియం లో జరిగిన ఈ సదస్సులో సంపత్ మాట్లాడు తూ.. భావితరాలకు ఉపయోగపడే విధంగా వ్యర్థాల నియంత్రణ, పునర్విని యోగంపై మరిన్ని పరిశోధనలు జరగాలన్నారు. వ్యర్థాలను తగ్గించడం ద్వారా పరిశ్రమల ఉత్పాదకత పెరుగుతుందని, దీంతో ఉపాధి అవకాశాలు మెండవుతాయని అన్నారు. రాష్ట్రంలో మున్సిపాలిటీల ద్వారా రోజుకు 50వేల టన్నుల చెత్త వస్తోందని, ఆసుపత్రుల నుంచి రోజుకు 10వేల టన్నులు, పరిశ్రమల నుంచి ఏడాదికి లక్షల టన్నుల వ్యర్థాలు బయటకు వస్తున్నాయన్నారు. వ్యర్థాల నియంత్రణకు కఠిన చట్టాలు రూపొందించే లా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. వ్యర్థాల రంగంలో అవకాశాలు.. వివిధ రకాల వ్యర్థాలను సేకరించి వాటిని పునర్ వినియోగించడంలో ఎన్నో లాభాలు న్నాయని రాంకీ సంస్థల చైర్మన్ అయోధ్య రామిరెడ్డి అన్నారు. వ్యర్థాల నిర్వహణకు సంబంధించి మూడు దశాబ్దాల కిందట రాంకీ రూపొందించిన మోడల్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గత పదేళ్లు గా సమాజంలో ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగవడంతో కుటుంబాలు, పరిశ్ర మల నుంచి కూడా వ్యర్థాలు పెరిగాయ న్నారు. స్వచ్ఛభారత్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వ్యర్థాల నిర్వహణకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. రోజురోజుకూ వ్యర్థాల పరిమాణం పెరుగు తున్నందున, ఈ రంగం లోకి వచ్చేవారెవరైనా సొమ్ము చేసుకునేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. సదస్సులో మిథాని డైరెక్టర్ ఎస్.కె.ఝా, జాతీయ ఉత్పాదకత మండలి ప్రాంతీయ సంచాలకుడు డాక్టర్ హేమంత్‌కుమార్‌రావు, రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ సాంకేతిక, ప్రణాళిక, పరిశోధన విభాగాధిపతి డాక్టర్ కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జాతీ య ఉత్పాదకత వారోత్సవాల నేపథ్యంలో ఎన్పీసీ నిర్వహించిన పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. -
ఎప్పటిలోగా పరిష్కరిస్తారు?
► ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్‌కు ‘సుప్రీం’ ప్రశ్న ► వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ ఉత్తర్వులు ► వచ్చే నెల 8వ తేదీకి విచారణ వాయిదా ► ఆదేశాలను వెంటనే అమలు చేయాలి: ఎమ్మెల్యే సంపత్ సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులపై దాఖలైన అనర్హత పిటిషన్లను ఎప్పటిలోగా పరిష్కరిస్తారని శాసన సభాపతిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై వారంరోజుల్లో సమాధానం చెప్పాలంటూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిరాయిం పుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలంటూ తెలంగాణ శాసన సభాపతికి పిటిషన్ సమర్పించామని.. కానీ స్పీకర్ ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదని, తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సుప్రీం లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. తొలుత ప్రతివాదుల తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తమ తరఫు సీనియర్ న్యాయవాది, అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అందుబాటులో లేరని... స్పీకర్‌కు, ఇతర ప్రతివాదులకు నోటీసులు కూడా అందనందున కొంత సమయం కావాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీనిని పిటిషనర్ తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తప్పుబట్టారు. ఈ కేసులో జాప్యం చేసేందుకు ప్రతివాదులు ప్రయత్నిస్తున్నారని, నోటీసులు అందలేదనడంలో వాస్తవం లేదని కోర్టుకు వివరించారు. పిటిషనర్ స్వయంగా స్పీకర్‌కు శాసనసభలోనే నోటీసులు అందజేశారని.. దానిపై ప్రసార సాధనాలు వార్తలు కూడా ప్రసారం చేశాయని తెలిపారు. అంతేగాకుండా గతేడాది ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించినప్పుడు స్పీకర్ అనర్హత పిటిషన్లను త్వరగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నదని.. కానీ ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లేదని చెప్పారు. దీంతో జస్టిస్ కురియన్ జోసెఫ్ స్పందిస్తూ.. ‘అనర్హత పిటిషన్లను పరిష్కరించేందుకు ఎంత సమయం కావాలో వారం రోజుల్లో ఐదో ప్రతివాది (స్పీకర్) సమాధానం చెప్పాలి..’’ అని ఆదేశించారు. తగిన సూచనలు తీసుకుని విచారణకు రావాలని ప్రతివాదుల తరఫు న్యాయవాదులకు సూచిస్తూ విచారణను నవంబర్ 8కి వాయిదా వేశారు. కాగా టీడీపీ నుంచి గెలిచిన ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా.. టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత కోసం అప్పట్లోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ స్వయంగా తానే టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లడంతో తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. సాగదీత యత్నాలకు కోర్టు చెక్: సంపత్ సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడిన అనంతరం ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, నైతిక విలువలను తుంగలో తొక్కిందని విమర్శించారు. ‘‘టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ నుంచి ఏడుగురిని, మిగతా పార్టీలన్నింటి నుంచి 24 మందిని లాక్కుంది. డబ్బు సంచులు, పదవులు ఎరచూపి ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ విప్‌గా వివిధ స్థాయిల్లో న్యాయ పోరాటం చేస్తున్నా. సుప్రీంకోర్టు నుంచి ఈరోజు చక్కటి ఆదేశాలు వెలువడ్డాయి. వాయిదాలతో జాప్యం చేసే కుయుక్తులకు ఇదొక పరిష్కారం. సాగదీత ప్రయత్నాలను ధర్మాసనం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. నోటీసులు అందలేదని ప్రతివాదులు చేసిన వాదనలను కూడా నమ్మలేదు. నైతిక విలువలపై నమ్మకముంటే ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలి..’ అని సంపత్ పేర్కొన్నారు. 2014లో ఎన్నికలు జరిగితే అదే ఏడాది ఆగస్టులో అనర్హత పిటిషన్ వేశామని.. కానీ స్పీకర్ పరిష్కరించలేదని న్యాయవాది జంధ్యాల రవిశంకర్ పేర్కొన్నారు. హైకోర్టుకు వెళితే త్వరితగతిన పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిందని... అయినా స్పీకర్ ఇప్పటివరకు పరిష్కరించలేదని చెప్పారు. తాజాగా సుప్రీంకోర్టు మా పిటిషన్లో ఐదో ప్రతివాది అయిన స్పీకర్‌కు ఆదేశాలు జారీచేసిందని.. ఇది ప్రజాస్వామ్య విజయమని వ్యాఖ్యానించారు. -
ఫిరాయింపుదారులకు నజరానాలు
హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుని ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రజల సొమ్మును పంచిపెడుతున్నదని కాంగ్రెస్ విప్, ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఖమ్మం ఎంపీ శ్రీనివాస్ రెడ్డికి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కు సీఎం కేసీఆర్ ప్రభుత్వ భూములను కట్టబెట్టారని ఆరోపించారు. జీఓ 59 కింద 45 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించారని ఎమ్మెల్యే చెప్పారు. ఈ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న నీతిమాలిన రాజకీయాలకు అధికారులు సహకరించవద్దని సంపత్ సూచించారు. ఫిరాయింపుదారులకు టీఆర్ఎస్ నజరానాలు ఇస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే అబద్దపు సర్వేలను ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ సర్వేలను ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే సంపత్ హెచ్చరించారు. -
గద్వాల పేరును అంగీకరించం: ఎమ్మెల్యే
హైదరాబాద్: గద్వాల జిల్లాకు జోగులాంబ పేరు పెట్టాలని మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. గద్వాల పేరును తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని హైపవర్ కమిటీకి వివరించామని చెప్పారు. కాగా, కొత్త జిల్లాల ఏర్పాటుపై కె. కేశవరావు నాయకత్వంలో నియమించిన హైపవర్ కమిటీతో పలు జిల్లాల నాయకులు సమావేశమయ్యారు. నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల నాయకులు హైపవర్ కమిటీకి తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను తెలిపారు. జనగామ జిల్లా ఏర్పాటుపై ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చర్చించారు. మంత్రి కేటీఆర్, ఎంపీ బాల్క సుమన్ సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై హైపవర్ కమిటీతో సంప్రదింపులు జరిపారు. -
యాజమాన్య కోటాలో రిజర్వేషన్లు అక్కర్లేదు
ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీపై హైకోర్టు సంచలన తీర్పు ♦ కన్వీనర్ కోటా సీట్లకే రిజర్వేషన్లు వర్తిస్తాయి ♦ శాసన, అధికార ఉత్తర్వులు లేనప్పుడు రిజర్వేషన్లు కోరలేరు ♦ ఉభయ రాష్ట్రాలు జారీ చేసిన జీవోలకు సమర్థన ♦ ఫీజుల ఖరారు జీవోల్లో జోక్యానికి నిరాకరణ సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో యాజమాన్యపు కోటా (బీ కేటగిరీ) కింద భర్తీ చేసే సీట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం లేదని ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కన్వీనర్ కోటా (ఏ కేటగిరీ) కింద భర్తీ చేసే సీట్లకు మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయని తేల్చి చెప్పింది. శాసనపరమైన ఆదేశాలు గానీ, అధికార ఉత్తర్వులు గానీ లేనప్పుడు బీ కేటగిరీ సీట్లలో రిజర్వేషన్లు కోరడానికి ఎంత మాత్రం వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. బీ కేటగిరీ సీట్ల భర్తీ విషయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు తొలగిస్తూ ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు గతేడాది జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ప్రైవేటు యాజమాన్యాలకు లబ్ధిచేకూర్చేందుకే ఇరు ప్రభుత్వాలు బీ కేటగిరీ నుంచి రూల్ ఆఫ్ రిజర్వేషన్లు తొలగించాయన్న పిటిషనర్ల వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. అదే విధంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు ఫీజులను ఖరారు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యానికి సైతం హైకోర్టు నిరాకరించింది. ఫీజు నియంత్రణ కమిటీ (ఎఫ్ఆర్సీ) సిఫారసుల మేరకు ఏపీ ప్రభుత్వం, ఎఫ్ఆర్సీ లేనందున కాలేజీల ఆదాయ, వ్యయాల ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ఫీజులను ఖరారు చేశాయని హైకోర్టు తెలిపింది. ప్రవేశాలు పూర్తయి, తరగతులు కూడా ప్రారంభమై నాలుగు నెలలవుతున్న నేపథ్యంలో ఫీజు ఖరారు వ్యవహారంలో ఇప్పుడు జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పిం ది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం ఈ మధ్యనే తీర్పు వెలువరించింది. సవరణ జీవోలు రాజ్యాంగ విరుద్ధం... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ ఎయిడెడ్, నాన్ మైనారిటీ వృత్తి విద్యా సంస్థల నిబంధనలకు సవరణలు చేస్తూ ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు గతేడాది జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం పిటిషన్ దాఖలు చేసింది. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ గతంలో పిల్ కూడా దాఖలు చేశారు. ఇదే అంశంపై ఉభయ రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే బీ కేటగిరీ సీట్ల ఫీజును రూ. 2.40 లక్షల నుంచి రూ. 9 లక్షలకు పెంచుతూ జారీ చేసిన జీవోలను కూడా సవాలు చేస్తూ మరికొందరు విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ సుభాష్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం వీటన్నింటిపై సుదీర్ఘ విచారణ చేపట్టి ఇటీవల ఉమ్మడి తీర్పునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ వృత్తి విద్యా సంస్థలు (అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అండ్ డెంటల్ కోర్సుల్లో ప్రవేశాల నియంత్రణ) నిబంధనలు 2007 మేర ఉమ్మడి రాష్ట్రంలో బీ కేటగిరీ కింద సీట్ల భర్తీలో రిజర్వేషన్లు కల్పించారని పిటిషనర్లు కోర్టుకు నివేదించారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం ఆ నిబంధనలనే తమకూ వర్తింప చేసుకుందన్నారు. దీని ప్రకారం ఉభయ రాష్ట్రాలు వివిధ వర్గాలకు బీ కేటగిరీ సీట్ల భర్తీలో రిజర్వేషన్లు కల్పించాలని, అయితే ప్రైవేటు కాలేజీలకు లబ్ధి చేకూర్చేందుకు ఆ నిబంధనలకు సవరణలు చేస్తూ ఉభయ రాష్ట్రాలు జీవోలు జారీ చేశాయని పిటిషనర్లు వివరించారు. ఈ సవరణలు రాష్ట్రపతి ఉత్తర్వులకు, రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. అంతేకాక ఈ సవరణ జీవోలను ఎంసెట్-2015 నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత అమల్లోకి తెచ్చారని, కాబట్టి వాటిని 2015-16 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు వర్తింప చేయడానికి వీల్లేదన్నారు. ఒప్పందం మేరకే సవరణ జీవోలు పిటిషనర్ల వాదనలను అటు ఉభయ రాష్ట్రాల ఏజీలు, ఇటు ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల యాజమాన్యం సంఘం తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు. ప్రభుత్వాలకు, కాలేజీల యాజమాన్యాల సంఘానికి మధ్య ఒప్పందం ఆధారంగా సవరణ జీవోలు వచ్చాయని, ఫీజు ఖరారు కూడా ఆ ఒప్పందం ఆధారంగానే జరిగిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ఏజీలు, కాలేజీల యాజమాన్యం న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తున్నట్లు పేర్కొంది. రిజర్వేషన్ల విషయంలో ఇనామ్‌దర్ కేసుతో సహా సుప్రీం కోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది. ఎంసెట్ నోటిఫికేషన్ జారీ అయినంత మాత్రాన ప్రవేశాలపై విద్యార్థులకు ఎటువంటి హక్కు రాదని స్పష్టం చేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ అన్ని వ్యాజ్యాలను కొట్టేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ప్రైవేటు వైద్య కళాశాలల్లో సీట్ల కేటగిరీలు ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎ-కేటగిరీ సీట్లంటే కన్వీనర్ కోటా సీట్లు. ఇవి ఆ కళాశాలలోని మొత్తం సీట్లలో 50 శాతం. వీటిని ఎంసెట్ మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. బి- కేటగిరీ అంటే యాజమాన్య కోటా సీట్లు. ఇందులో 35 శాతం సీట్లు ఉంటాయి. వీటిని కళాశాల యాజమాన్యాలే ప్రత్యేక పరీక్ష ద్వారా భర్తీ చేసుకుంటాయి. సి-కేటగిరీ సీట్లంటే ప్రవాస భారతీయ (ఎన్నారై) కోటా సీట్లు. ఇవి 15 శాతం ఉంటాయి. వీటిని కూడా నిబంధనలకు లోబడి యాజమాన్యాలే భర్తీ చేసుకుంటాయి. -
ఎస్సీ, ఎస్టీలకు మెడికల్ సీట్లు వద్దా?
ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మెడికల్ సీట్ల ఫీజులను పెంచడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ విమర్శించారు. బీ-కేటగిరీ సీట్లను ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలకు అప్పగించడం వల్ల వాటికి విపరీతంగా ఫీజులు పెరిగాయన్నారు. ఒక్కొక్క సీటుకు రూ.1.3 కోట్లు అడుగుతున్నారని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్ల ప్రకారం మెడికల్ సీట్లను ఇవ్వాలని సంపత్ సోమవారం డిమాండ్ చేశారు. ఈ విషయంలో కోర్టుకు వెళ్తామన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన చేపడతామని చెప్పారు. -
'ఓటమి పాలవుతామనే ఎన్నికలకు వెనుకంజ'
హైదరాబాద్:కోర్టులు తప్పుబడుతున్నా తెలంగాణ సర్కారు సర్కారు తీరులో మార్పు రావడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఓటమి పాలవుతామనే ఆందోళనతో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలకు వెనుకాడుతుందని ఎద్దేవా చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకైనా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన తెలిపారు. దీంతో పాటు పెండింగ్ లో ఉన్న ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లకు కూడా ఎన్నికలు జరపాలన్నారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను ఉన్న పళంగా బర్తరఫ్ చేసిన సర్కారు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే రాజీనామాను ఎందుకు ఆమోదించడం లేదని సంపత్ కుమార్ ప్రశ్నించారు.