అలంపూర్ నియోజకవర్గ మిరప రైతులు నగరంలోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు
హైదరాబాద్: నకిలీ మిర్చీ విత్తనాల బారిన పడిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. అలంపూర్ నియోజకవర్గ మిరప రైతులు నగరంలోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు.
రైతులకు న్యాయం చేసేంత వరకు ఇక్కడే కూర్చుంటామని రైతులు కార్యాలయం ఎదుట బైఠాయించారు. వారి నిరసనకు ఎమ్మెల్యే సంపత్ కుమార్ సంఘీభావం తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు.