మంత్రి కేటీఆర్ తమ పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలు సమకాలీన రాజకీయాలకు మచ్చతెచ్చేలా ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విమర్శించారు. కేటీఆర్ తాత పుట్టకముందే కాంగ్రెస్ పార్టీ పుట్టిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తామని ఆయన మాదిరి అన్న నేతలంతా చరిత్రలో కలిసిపోయారని చెప్పారు.