గన్‌మెన్‌లను తిప్పిపంపిన ఎమ్మెల్యే
హైదరాబాద్: తన రక్షణకు కేటాయోగించిన గన్ మెన్‌లను అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తిప్పి పంపారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. అంబేద్కర్ జయంతి సందర్బంగా తన గన్‌మెన్‌లను ఎమ్మెల్యే తిప్పి పంపారు. రాష్ట్రంలో ప్రజలకు లేని రక్షణ తనకెందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రక్షించాల్సిన పోలీసులే ప్రజలను భక్షిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు.