
'ఓటమి పాలవుతామనే ఎన్నికలకు వెనుకంజ'
హైదరాబాద్:కోర్టులు తప్పుబడుతున్నా తెలంగాణ సర్కారు సర్కారు తీరులో మార్పు రావడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఓటమి పాలవుతామనే ఆందోళనతో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలకు వెనుకాడుతుందని ఎద్దేవా చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకైనా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన తెలిపారు. దీంతో పాటు పెండింగ్ లో ఉన్న ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లకు కూడా ఎన్నికలు జరపాలన్నారు.
మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను ఉన్న పళంగా బర్తరఫ్ చేసిన సర్కారు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే రాజీనామాను ఎందుకు ఆమోదించడం లేదని సంపత్ కుమార్ ప్రశ్నించారు.