రాజకీయాలకతీతంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి కలిసికట్టుగా ఆలోచించి ఒక విధానం రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి ఎన్నో కార్యక్రమాలు, పథకాలు అమలు చేసినప్పటికీ... ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో పేదరికం పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పని చేయాల్సి ఉందన్నారు. శుక్రవారం అన్ని పార్టీలకు చెందిన ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం ప్రగతిభవన్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.